పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/245

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



3. ఆపదలో జిక్కిన విశ్వాసుల ప్రార్ధన-అచ 4,23-31

1. పేత్రు యేసు పేరుమీదిగా ఓ కుంటివానికి నడిచే శక్తినిచ్చాడు. ఈ యద్భుతాన్ని చూచి యెరూషలేము పౌరులు ఆశ్చర్యపడ్డారు. పేత్రు యోహాను దేవళంలో బోధచేసి ప్రజలకు క్రీస్తుమీద విశ్వాసం పుట్టించారు. ఇదంతా చూచి యూదుల పెద్దలు క్రొత్త మతం వ్యాప్తిలోకి వస్తుందని భయపడ్డారు. అపోస్తలులను చెరలో వేయించారు, బెదరించారు. కడన యేసు పేరుమీదిగా బోధించవద్దని హెచ్చరించి వారిని విడుదల చేసారు. అదొక చిన్న వేదహింస, కాని ఆత్మ దిగివచ్చాక అపోస్తలులు క్రీస్తుని గూర్చి బోధించకుండా వుండలేరు. కనుక పేత్రు యోహాను యెరూషలేములోని క్రైస్తవ సంఘాన్ని కలిసికొని జరిగిన సంగతులన్నీ వారికి వివరించారు. ఆ సందర్భంలో క్రైస్తవ భక్తులందరూ యూదుల వేదహింసనుండి తమ్ము కాపాడమనీ, తమకు క్రీస్తుని బోధించే ధైర్యాన్ని ప్రసాదించమనీ తండ్రిని ప్రార్ధించారు. యేసు పేరిట అద్భుతాలు చేస్తే శక్తిని దయచేయమని వేడుకొన్నారు.

2. దేవుడు వారి మొర ఆలించాడు. దానికి గుర్తుగా వారున్న తావు కంపించింది. పవిత్రాత్మ వారిమీదికి దిగి వచ్చింది. ఈ సంఘటనకు "రెండవ పెంతెకోస్తు" అనిపేరు. ఇది ఆత్మ రెండవసారి శిష్యులమీదికి దిగిరావడం కదా!

యూదులు వేదహింస ద్వారా శిష్యుల వుద్యమాన్ని అణచివేయబోయారు. కాని శిష్యులు భక్తితో ప్రార్ధనచేసి ఆ వేదహింస ద్వారానే తమ వద్యమాన్ని బలపరచుకొన్నారు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకు అన్నీ అనుకూలంగానే జరిగిపోతాయి కదా! - రోమా 828. ఆ గడియనుండి శిష్యులు ధైర్యంతో యెరూషలేములో దైవసందేశం విన్పింపసాగారు –4, 31.

3. ఈ సంఘటనం నుండి మనం నేర్చుకోవలసిందేమిటి? ఆపదల్లో దడవకూడదు. వినయంతో దేవునికి ప్రార్ధన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకు ధైర్యాన్నీ ఇక్కట్టులనుండి బయటపడే శక్తినీ గూడ ప్రసాదిస్తాడు. ఎప్పడుగూడ కష్టాలు మన విశ్వాసాన్ని పెంచుతాయి. అసలు దేవుడు మనకు కష్టాలను పంపేది మనలను తన దగ్గరికి రాబట్టుకోడానికే.

4. అన్యజాతులకు వేదబోధ - అ,చ, 18, 1-4,

1. అపోస్తలుల చర్యలు అనే పుస్తకం శిష్యులు ఆత్మశక్తితో వేదబోధ చేయడాన్ని వర్ణిస్తుంది. ఈ బోధ మూడంచెలుగా జరుగుతుంది. మొదట యెరూషలేములోను అటుపిమ్మట యూదియా సమరయు సీమల్లోను బోధ జరుగుతుంది. కట్టకడన అన్యజాతులకు వేదబోధ చేస్తారు. తొలి రెండు ఘట్టాల్లో పేత్రు యోహాను మొదలైనవాళ్ళు ముఖ్యలు. మూడవ ఘట్టంలో ప్రధానపాత్ర పౌలు. కనుక ప్రస్తుత వేదభాగం పౌలు ప్రేషితోద్యమం ఏలా ప్రారంభమైందో చెప్తుంది.

2. ఆ రోజుల్లో రెండు క్రైస్తవ కేంద్రాలుండేవి. పేత్రు మొదలైనవాళ్లు యెరూషలేములో పెద్దలు. పౌలు అతని మిత్రుడు బర్నబా అంటియోకయలో పెద్దలు, ఈ యంటియోకయలో భక్తులు ప్రార్ధనలూ ఉపవాసాలూ చేస్తుండగా పవిత్రాత్మ ఆ