పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/244

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్నోకష్టాలు తప్పించుకొన్నాం. ఎన్నో మేళ్లు పొందాం. కనుక మన బ్రతుకు నంతటినీ అతనికి అంకితం చేసికోవాలి. మన జీవితంలోని మంచిచెడ్డల్లోను అతని సాన్నిధ్యాన్ని గుర్తించాలి. జీవితాంతం అతన్ని పూజించి సేవించి ప్రేమిస్తామని మాట యిూయాలి. ఔను, మనలను కలిగించిన ప్రభువుని గాకపోతే మరెవరిని కొలుస్తాం?

2. సొలోమోను దేవాలయ ప్రార్ధన - 1 రాజు 8, 22-53

1. సాలోమోను రాజు ఎన్మిదేండ్ల దేవాలయాన్ని కట్టి ముగించాడు. దేవాలయాన్ని ప్రతిష్టించేపుడు సుదీర్ఘమైన ప్రార్థన చేసాడు. ఈ ప్రార్థన చాల భక్తిమంతమైంది. యి(సాయేలీయులు దేవునికి ప్రార్ధన చేయవలసిన అంశాలన్నీ ఈ జపంలో సూచింపబడ్డాయి. ఈ జపం నేడు మనకు గూడ ప్రేరణం పుట్టిస్తుంది.

2. దేవుడు సొలోమోను దేవళం నిర్మిస్తాడని పూర్వమే దావీదుకు వాగ్దానం చేసాడు. ఆ వాగ్ధానం ఈ దేవాలయ నిర్మాణంలో నెరవేరింది -8, 23-24 దావీదు సంతానం అవిచ్చిన్నంగా రాజ్యాన్ని పాలిస్తుందని గూడ ప్రభువు దావీదుకి బాస చేసాడు. ఆ బాస నిలబెట్టుకొమ్మని సొలోమోను ఇక్కడ దేవుణ్ణి వేడుకొన్నాడు - 8, 25-26.

తర్వాత సొలోమోను ఒక్కొక్క మనవి దేవుని ముందుంచి వాటిని ఆలించమని అర్ధించాడు. ఆ మనవులు వరుసగా ఇవి : 1. దేవుడు ప్రజల పాపాలను మన్నించాలి 27-30.

2. జనం ఒకరితో ఒకరు పోట్లాడుకొని తీర్పుకొరకు దేవళానికి వస్తే ప్రభువు వారికి తీర్పు చెప్పాలి 31-32.

3.ప్రభువు యుద్ధంలో ఓడిపోయినవారి మనవి వినాలి 33–34.

4.అనావృష్టిలో ప్రజల వేడికోలు వినాలి 35-36.

5.కరువు, తెగుళ్ళు అంటురోగాలు వచ్చినపుడు ప్రజల మనవి వినాలి 37-40.

6.అన్యజాతి ప్రజలు ప్రార్థన చేసినపుడు వినాలి 41–48.

7.యుద్దానికి పోయేవాళ్ళ మొర ఆలించి వారికి విజయాన్ని దయచేయాలి 44-45.

8.బాబిలోనియా ప్రవాసంలో చిక్కుకొన్నవారి మొరవినాలి 46-51.

9.ప్రభువు రాజు మొర ఆలించాలి 52-53.

ఇన్ని అక్కరల కొరకు చేసిన ప్రార్ధన బైబుల్లో మరొకటి కన్పించదేమో! ఈ జపం మన అవసరాల్లో మనం దేవునికి ఏలా విన్నపాలు చేయాలో నేర్పుతుంది.

3. ఆ యిస్రాయేలీయుల్లాగే మనంకూడ పాపులం. పాపకార్యాలుచేసి కష్టాలు తెచ్చుకొంటాం. కాని ఆ కష్టాల్లోనైనా తెలివి తెచ్చికొని దేవుని సన్నిధిలోకి వెళ్లాలి. అతని సహాయాన్ని అర్ధించాలి. లేకపోతే నాశమైపోతాం. మన యిక్కట్టుల్లో దేవుని సన్నిధిలోకి వెళ్ళి వినయంతో ప్రార్ధిస్తే ఆ ప్రభువు మన ఆపదలు తీరుస్తాడు. మనం బ్రతికిపోతాం. పాపులైనాసరే మంచిబుద్ధితో దేవుని దగ్గరికి వెళ్తే చాలు, దేవుడు వారి మనవి వింటాడు. సాలోమోను ప్రార్ధన మనకు నేర్పే సత్యం ఇదే.