పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/234

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంగీకరించలేదు - సంఖ్యా 14, 12. మరోసారి, బంగారు దూడను ఆరాధించినందుకు దేవుడు యిస్రాయేలును నాశం చేయబోయాడు. అప్పడు మోషే ప్రజల కొరకు మనవిచేసి దేవునితో, నీవు వీళ్ళను మన్నించనైనా మన్నించు లేదా నా పేరునైనా నీ గ్రంథంనుండి కొట్టివేయి అన్నాడు- నిర్గ 32,31. ఈ యంశాలనుబట్టి అతడు ఎంత ఉత్తమ నాయకుడో తెలిసికోవచ్చు. మరి నేటి మన నాయకత్వం ఏలా వుంది?

2.ప్రభువు మోషేను ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. తన ప్రజలను బానిసంనుండి విడిపించుకొని రమ్మన్నాడు. కాని మోషేకూడ బానిసే. అంతకు ముందే అతడు ఫరోకి భయపడి పారిపోయి వచ్చాడు. ఆలాంటివాడు ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడగలడా? కనుక జంకాడు. కాని ప్రభువు అతన్ని ప్రోత్సహించి నేను నీకు తోడై యుంటానని చెప్పాడు — నిర్గ 3, 12. తాను చెప్పినట్లే మోషేకు అండగా నిల్చాడు. కనుకనే అతడు యిప్రాయేలీయులను నడిపించుకొని రాగల్లాడు. నేడు మన కార్యాల్లోగూడ ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. అతని సహాయంతోనే మనం విజయాలు సాధించేది.

3.భూమిమీది నరులందరిలోను మోషే వినయవంతుడు అని చెప్మంది బైబులు - సంఖ్యా 12,3. యిప్రాయేలు ప్రజలు చాలాసార్లు అతనిమీద తిరగబడ్డారు. అతని అధికారాన్ని సవాలు చేసారు. అతని తోబుట్టువులైన మిర్యాము అహరోనులు కూడ అతనిపై తిరగబడ్డారు. నీ వొక్కడివే నాయకుడివా మేముమాత్రం కాదా అని దబాయించారు - సంఖ్యా 12,2. ఐనా ఆ మహానుభావుడు చలించలేదు. వినయంతో తన పనులు తాను చేసికొంటూ పోయాడు. మనంకూడ అతనిలాగవినయాత్మలమైన నాయకులం కావాలి.

4. మోషే చాల విధాలుగ క్రీస్తుని సూచిస్తాడు. అతడు ప్రవక్త తనలాంటి ప్రవక్త మరొకడు వస్తాడని తెలియజేసాడు. ఆ ప్రవక్తి క్రీస్తు — ద్వితీ 18, 18. మోషే ద్వారా ధర్మశాస్త్రం లభిస్తే క్రీస్తుద్వారా కృపాసత్యాలు లభించాయి - యోహా 1.17. మోషే యూదులను కనాను దేశానికి చేరిస్తే క్రీస్తు మనలను మోక్షానికి చేరుస్తాడు - హెబ్రే 3,6న మోషే క్రీస్తుని సూచించేవాడు. కాని క్రీస్తు అతనికంటె గొప్పవాడు. మోషే ప్రధానంగా పూర్వవేద నిబంధన కర్త కాని క్రీస్తు సీనాయి నిబంధనంకంటె గొప్ప నిబంధనను నెలకొల్పాడు - హెబ్రే 8,6. నేడు మనం ఈ యిద్దరు నాయకులనూ భక్తితో స్మరించుకోవాలి. 226