పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/233

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోషే మీద తిరగబడ్డారు. దానికి శిక్షగా దేవుడు వారిని విషసర్పాలతో కరిపించాడు. అప్పడు కూడ మోషే ఆ జనుల తరపున విజ్ఞాపనంచేసి వారిని అపాయంనుండి కాపాడాడు-సంఖ్యా21, 6–9. కనుకనే కీర్తన 106,23 అతన్ని గూర్చి యిూలా చెప్పంది:

"ప్రభువు ఆ ప్రజలను నాశంజేయ నెంచాడు
 కాని తా నెన్నుకొనిన సేవకుడైన మోషే అతని కడుపడి
అతని కోపాన్ని చల్లార్చి వారిని కాపాడాడు.”
 ప్రజలు బంగారు దూడను కొల్చిన సందర్భంలో అతడు దేవునితో "నీవు ఈ

ప్రజల పాపాలయినా మన్నించు, లేదా నా పేరైనా నీ గ్రంథంనుండి కొట్టివేయి" అని మనవి చేసాడు - నిర్గ 32, 82. ప్రజలపట్ల అతనికున్న ప్రేమ అంతగొప్పది. ఈ ప్రార్ధన ద్వారా అతడు రాబోయే బాధామయ సేవకుణ్ణి సూచించాడు. ఆ సేవకుడు “పెక్కుమంది దోషాలను భరించి వారి పాపాల పరిహారం కొరకు విజ్ఞాపనం చేసాడు" - యెష53, 12. 5.

5.ప్రభువు తేజస్సు

మోషే పది ఆజ్ఞలు పొందడానికి కొండమీదికి వెళ్లినప్పుడు ప్రభువు సాన్నిధ్యంసోకి అతని ముఖం ప్రకాశించింది. ఆ ప్రకాశాన్ని చూచి ప్రజలు భయపడ్డారు. కనుక అతడు ప్రజలతో మాట్లాడినంతసేపు ముఖం మీద ముసుగువేసికొనేవాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పడు మాత్రం ఆ ముసుగును తొలగించేవాడు - నిర్గ 34, 29–35.

పౌలుభక్తుడు ఈ సంఘటనను గూర్చి చెపూ మోషే కండ్లను ముసుగు కప్పివేసినట్లుగా అజ్ఞానం యూదుల కండ్లను కప్పివేసిందన్నాడు. ఎందుకంటే మోషే క్రీస్తుని సూచించేవాడు. అతని కథను చదివాక గూడ యూదులు క్రీస్తుని అంగీకరింపని గ్రుడ్డివారుగానే వుండిపోయారు - 2 కొ 3, 13-15. నిజానికి మోషేను నమ్మేవాళ్ళంతా క్రీస్తుని గూడ నమ్మాలి, అతడు క్రీస్తుని గూర్చి వ్రాసాడు. ఐనా యూదులు మోషేను అంగీకరించి క్రీస్తుని నిరాకరించారు. అదే వారి గ్రుడ్డితనం - యోహా 5,46-47. ఐనా ప్రభువు తేజస్సుసోకి మోషే ముఖం ప్రకాశించినట్లుగానే పవిత్రాత్మ తేజస్సుసోకి ఉత్థాన క్రీస్తు ముఖం ప్రకాశిస్తుంది. ఆ ఉత్తాన క్రీస్తు తేజస్సుసోకి నేడు మనం కూడ ప్రకాశిస్తాం - 2 కొ 3,18.

స్వర్గంలోని భక్తులు మోషే ఆనాడు రెల్లసముద్రాన్ని దాటుతూ పాడిన పాటనీ గొర్రెపిల్ల గీతాన్నీ ఆలాపిస్తారు - దర్శ 15,3. రెల్లసముద్రాన్ని దాటిన మోషే క్రీస్తు పాస్క విజయాన్ని సూచిస్తాడు. ఈ పాస్క విజయగీతాన్నే మనం కూడ మోక్షంలో కలకాలం పాడతాం.

                                                      ప్రార్ధనా భావాలు

1. మోషే స్వార్థంలేని నాయకుడు. అతడు ప్రజలను కనాను దేశంమీదికి పొమ్మన్నప్పడు వాళ్లు అతనిమీద తిరగబడ్డారు. అదిచూచి దేవుడు నేను ఈ జనాన్ని నాశం జేసి నీ నుండి క్రొత్తజాతిని పుట్టిస్తానన్నాడు. కాని మోషే దానికి 225