పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/232

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసికొన్నాడు. మోషే ప్రజలమీదా పీరంమీదా కోడె నెత్తురు చిలకరించి ఇది నిబంధనకు సంబంధించిన రక్తం అని చెప్పాడు - నిర్గ 24,8.

ఈ సందర్భంలోనే యిస్రాయేలీయులు మోషేలోనికి జ్ఞానస్నానం పొందారు - 1 కొరి 10,2. అనగా వాళ్ళు అతన్ని అనుసరించి, మేఘం తమ్ము నడిపిస్తూండగా సముద్రాన్నిదాటి, రక్షణం పొందారు, ఆరీతిగా అతడు ప్రజలకు నాయకుడూ విమోచకుడూ అయ్యాడు - అ,చ. 7,85. ఈ విమోచకుడు నూత్న నిబంధనకు చెందిన మరో విమోచకుణ్ణి సూచిస్తాడు. అతడే క్రీస్తు. క్రీస్తు చేసిన నిబంధనం మోషే నిబంధనంకంటె మరింత శ్రేష్టమైంది - హెబ్రే 8,6. అతడు నేడు తన నామంలోనికి జ్ఞానస్నానం పొందిన మనలనందరినీ పాపంనుండి విమోచిస్తాడు - అ, చ. 2,38,

3.ప్రవక్త,ధర్మశాత్రప్రదాత

మోషే యిప్రాయేలీయులకు గొప్ప ప్రవక్త, అతడు ఎప్పడూ వారికి దైవసందేశాన్ని విన్పిస్తుండేవాడు - నిర్ణ 19,6. ప్రజలుమాత్రం అతని సందేశాన్ని అట్టే ఆలించేవాళ్లుకాదు. ఐనా అతడు నిబంధన నియమాలను పాటించండని ప్రజలను నిరంతరం హెచ్చరించేవాడు.

కడన అతడు భవిష్యతులో తనలాంటి ప్రవక్త మరొకడు వస్తాడనీ యిప్రాయేలీయులు అతని సందేశాన్ని ఆలించాలనీ చెప్పాడు - ద్వితీ 18, 15. ఈ ప్రవక్త రానున్న క్రీస్తే - అ,చ. 3,20-23. ఇతనికి మోషే సాక్ష్యం పలికాడు - యోహా 4,46. కనుకనే దివ్యరూపధారణ కాలంలో తబోరు కొండ మీద క్రీస్తు ప్రక్కన మోషే కూడ కన్పిస్తాడు - లూకా 9, 30.

ప్రజలు ధర్మశాస్త్రాన్నిచ్చినవాడు మోషే - నిర్ణ 20, 1-20. ప్రజలు ఆ ధర్మశాస్తాన్ని ఖండితంగా పాటించాలని అతడు వారిని హెచ్చరించాడు- ద్వితీ 6, 1-9.

నూత్న వేదంలో క్రీస్తు ధర్మశాస్తాన్ని నాశం చేయలేదు. దాన్ని పరిపూర్ణం చేసాడు - మత్త 5, 17. అతడు ధర్మశాస్త్రంకంటె అధికుడు. దాన్ని సమాప్తం చేసేవాడు కూడరోమా 10,4. మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తలు కీర్తనల గ్రంథం తన్ను గూర్చి చెప్పిన విషయాలన్నీ నెరవేరిన పిదపగాని అతడు ఉత్తానం కాలేడు - లూకా 24,44

4. విజ్ఞాపనమూర్తి

మోషే యెన్నోసార్లు యిస్రాయేలీయుల కొరకు విజ్ఞాపనం చేసాడు. రెఫీదీమవద్ద అమాలెకీయులతో యుద్ధం జరిగినపుడు అతడు తన ప్రజల కొరకు మనవిచేసి వారికి విజయాన్ని సాధించిపెట్టాడు - నిర్గ 17, 9–13. ప్రజలు బంగారు దూడను గొల్చి ప్రభువు ఆగ్రహానికి గురయ్యారు. అప్పడు మోషే వారి కొరకు మనవిచేసి దేవుని కోపంనుండి వారిని కాపాడాడు - నిర్గ 32, 11-14. మోషే కనాను మండలాన్ని జయించడానికి పొమ్మన్నప్పడు ప్రజలు అతనిమీద తిరగబడి అతన్ని రాళ్ళతో కొట్టి చంపబోయారు. అందుచే ప్రభువు ఆ ప్రజలపై కోపించి వారిని నాశం చేయబోయాడు. అప్పడు కూడ మోషే ఆ జనుల తరపున విజ్ఞాపనం జేసి వారిని దైవకోపాన్నుండి తప్పించాడు - సంఖ్యా 14, 10–20 ఇంకా, ఎడారి ప్రయాణంలో అలసిపోయి ప్రజలు 224