పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/225

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నూను కుమారుడైన యెహోషువ మహావీరుడు
మోషే తర్వాత అతడు ప్రవక్త అయ్యాడు
తన పేరుకు తగినట్లుగానే జీవించి
దైవప్రజలను ఆపదనుండి రక్షించాడు
తన కడ్డువచ్చిన శత్రువులనెల్ల ఓడించి
యిస్రాయేలీయులకు వాద్దత్తభూమిని
సంపాదించి పెట్టాడు.

ఈ యెహోషువ రాబోయే మరో యెహోషువకి సూచనంగా వుంటాడు. అతడే యేసుక్రీస్తు, హీబ్రూ భాషలో అతని పేరుకూడ యెహోషువయే. ఆ పేరే 'యేసు' ఐంది - మత్త 1, 21, యెహోషువ ప్రారంభించిన రక్షణ కార్యాన్నే తర్వాత యేసు తన మరణోత్తానాలతో పరిపూర్ణంగా సాధించిపెట్టాడు. ఈ యిద్దరిపేర్లు ఒకటే కావడం విశేషం. యెహోషువ యిస్రాయేలీయులను వాగ్రత్తభూమికి చేర్చి విశ్రాంతిని దయచేసాడు. కాని ఆ విశ్రాంతి నాడు యూదులు వాద్దత్త భూమిని చేరుకోవడంతో ముగియలేదు. నేడు మనం మోక్షాన్ని చేరుకొన్నపుడుగాని అది పూర్తిగా ముగియదు. యూదులకు వాగ్లత్త భూమిలాగే మనకు మోక్షం విశ్రాంతి స్థానం. యెహోషువలాగే మనంకూడ జీవితాంతం పోరాడి ఈ వాద్దత్తభూమిని చేరుకోవాలి. ఈ ఉద్యమంలో అతడు మనకు ప్రేరణంగా వుంటాడు — హెబై 4, 8-11.

ప్రార్థనా భావాలు

1. యెహోషువ యుద్ధవీరుడు, ప్రజలకు నాయకుడు, ప్రభువుకి నమ్మిన బంటు, పరమ విధేయుడు, భక్తిమంతుడు. అతడు వాగ్గత్తభూమిని జయించడానికి పూనుకోకముందు ప్రభువు అతనితో "నీవు ధైర్యస్థిర్యాలను అలవర్చుకో నిర్భయంగా నిస్సంశయంగా మెలుగు, నీ దేవుడనైన నేను ఎల్లవేళల నీకు తోడై యుంటాను" అని చెప్పాడు – 1, 9. ప్రభువు అతనికిలాగే మనకుకూడ తోడుగా వుంటాడు. దైవబలంతోనే నేడు మనంకూడ పనిచేయాలి. 2. యెహోషువ చనిపోకముందు యిప్రాయేలీయులతో "మీరు ప్రభువునే పూజిస్తారో లేక అన్యదైవాలనే పూజిస్తారో నిర్ణయించుకోండి" అన్నాడు - 24, 14-15. నాటి యూదులకులాగే నేటి మనకుగూడ ఈ నిర్ణయం అత్యవసరం. మన భక్తికూడ ఈ నిర్ణయాన్ని బట్టే వుంటుంది.