పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/223

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనా భావాలు 1. క్రీస్తుని సూచించేవాడుగాన పూర్వవేదంలో మెల్మీసెదెకు ఉన్నతమైన వ్యక్తి, అతడు అన్యజాతులకు చెందినవాడు. ఐనా సర్వోన్నతుడైన దేవుణ్ణి తెలిసికొని అతన్నే పూజించాడు. నీతికీ శాంతికీ నిలయమై ఒప్పాడు. కనుకనే నేడు మనం పూజలో ఇతని పేరు స్మరించుకొంటున్నాం. దేవుడు హేబెలు కానుకలనూ, అబ్రాహాము బలినీ, మెల్మీసెదెకు బలినీ అంగీకరించినట్లే మనమర్పించే అప్పరసాలనుగూడ అంగీకరించాలని వేడుకొంటున్నాం. దేవుడు ఒక్క యూదులు మాత్రమేకాక అన్యజాతులవాళ్ళుకూడ మెస్సీయాను సూచించేలా చేసాడు. కనుక మెల్మీసెదకులాంటి అన్యజాతి భక్తులు కూడ మనలను క్రీస్తు దగ్గరికి చేరుస్తారు. అందుచే ఆ భక్తుణ్ణి మనం గౌరవంతో స్మరించుకోవాలి.

5. యెహోషువ

యెహోషువ యిస్రాయేలీయులకు నాయకుడు, క్రీస్తుకి సూచకవ్యక్తి. ఇక్కడ ఈ రెండంశాలను పరిశీలిద్దాం.

1. యిస్రాయేలీయులకు నాయకుడు

మోషే యిస్రాయేలీయులను ఐగుప్శనుండి తరలించుకొని వచ్చాడు. కాని వారిని వాగ్దాత్త భూమికి చేర్చకముందే మరణించాడు. మోషే ప్రారంభించిన కార్యాన్నియెహోషువ కొనసాగించాడు. కనుక పూర్వవేద చరిత్రలో అతనికి ప్రముఖస్థానం వుంది. అతడు క్రీస్తుపూర్వం 12వ శతాబ్దంలో జీవించినవాడు.

యెహోషువ మొదటలో మోషేకు సేవకుడు - సంఖ్యా 11,28. మోషే పదియాజ్ఞలు పొందటానికి కొండమీదికి వెళ్ళినపుడు యెహోషువగూడ అతనితో వెళ్లాడు. తర్వాత దైవసాన్నిధ్యంగల గుడారంలో పరిచర్యలు చేసాడు. "మోషే సేవకుడైన యెహోషువ మాత్రం గుడారాన్ని వీడివచ్చేవాడు కాదు" అంటుంది నిర్గమకాండం 33, 11. అనగా అతడు బాల్య ప్రాయంలోనే దైవానుభూతిని పొందాడు. విశ్వాసంతో జీవించాడు.

ఈ విశ్వాసంతోనే అతడు తర్వాత కనాను మండలాన్ని వేగుచూద్దానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినవాళ్లు కనానీయులను జూచి దడిసారు. వాళ్ళమీదికి యుద్దానికి వెళ్ళడానికి సాహసింపలేదు. కాలేబు,యొహోషువ మాత్రమే కానానీయుల మీదికి పోరాటానికి