పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/222

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ అబ్రాహాముని దీవించినవాడూ అతని నుండి కానుకలు పుచ్చుకొన్నవాడూ మెల్మీసెదెకు. కనుక అతడు అబ్రాహాముకంటె గొప్పవాడు. మెల్మీసెదెకు అన్యజాతులకు గురువు. ఐనా అతడు మహోన్నతుడైన దేవుణ్ణి కొల్చేవాడు. హెబ్రేయుల గురువైన అబ్రాహాము కూడ ఈ దేవుట్టే కొల్చాడు. కనుక వాళ్ళిద్దరికీ పొత్తు కుదిరింది. అధికుడైన మెల్మీసెదెకు తక్కువవాడైన అబ్రాహాముని దీవించి సంరక్షించాడు.

2. క్రీస్తుని సూచించేవాడు

మెల్మీసెదెకు క్రీస్తుని సూచిస్తాడని చెప్తుంది హెబ్రేయుల జాబు. పూర్వవేదంలో యూదుల యాజకత్వం లేవీ తెగనుండి వచ్చింది. నూత్నవేదంలో క్రీస్తు మనకు ప్రధానయాజకుడు. కాని అతడు లేవీ తెగకు గాక యూదా తెగకు చెందినవాడు. కనుక పూర్వవేద యాజకత్వం అతనికి వర్తింపదు. అతడు పూర్వవేద యాజకుల వరుసక్రమంలో రాలేదు.

110వ కీర్తన మెస్సీయా మెల్మీసెదెకు వరుసక్రమంలో వస్తాడని చెప్తుంది. "నీవు మెల్మీసెదెకులాగ యాజకత్వాన్ని పొందుతావు. కలకాలం యాజకుడివిగా వుంటావు" అని చెప్తుంది - 110,4. కనుక క్రీస్తు లేవీ వరుసలోగాక మెల్మీసెదెకు వరుసలో వచ్చిన యాజకుడు. అబ్రాహాము యాజకత్వం మెల్మీసెదెకు యాజకత్వంకంటె తక్కువది. అబ్రాహాము వంశజులైన లేవీపుత్రుల యాజకత్వం గూడ మెల్మీసెదెకు యాజకత్వం కంటె తక్కువదే. కాని మెల్కీసెదెకు వరుసక్రమంలో వచ్చిన క్రీస్తు యాజకత్వం లేవీ యాజకత్వంకంటె ఘనమైంది - హెబ్రే 7,7-10.

"మెల్మీసెదెకు” అంటే నీతిమంతుడైన రాజు, "షాలేము రాజు" అంటే శాంతిని కొనివచ్చేరాజు. క్రీస్తుకూడ నీతినీ శాంతినీ కొనివచ్చేవాడేకదా! కనుక అతడు ఇతన్ని సూచిస్తాడు. ఇంకా, ఆదికాండం మెల్మీసెదెకు తల్లిదండ్రులను గాని, వంశావళినిగాని, ఆద్యంతాలనుగాని పేర్కొనదు. అతనికి ఇవేమీలేవు. క్రీస్తుకూడ ఇవేమీ లేనివాడు. ఈ దృష్టిలో కూడా అతడు క్రీస్తుని పోలివుంటాడు. ఈ యిద్దరూ శాశ్వతులైన యాజకులు. కీర్తన 110,4మెల్కీసెదెకు నిత్యయాజకుడని చెప్పంది. క్రీస్తు కూడ నిత్యగురువు లేవీవంశపు యాజకులు నిత్య గురువులు కాదు. ఈ రీతిగా మెల్మీసెదెకుకీ క్రీస్తుకీ చాల పోలికలున్నాయి - హెబ్రే 7, 2-3.