పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

12. నిత్యజీవం :

నా దేహాన్నే ఆహారంగా యిస్తానన్నాడు ప్రభువు. బ్రతికివున్న మనిషిని ఎలా భుజిస్తామా అని శిష్యులంతా ప్రభువును విడచి వెళ్ళిపోయారు. పేతురు మొదలైనవాళ్ళు ఒకరిద్దరు వెంటరావడం జూచి 'మీరు గూడ వెళ్ళిపోతారా యేమిటి? అని అడిగాడు ప్రభువు. "ప్రభూ, మేమెక్కడికి వెత్తాం, నిత్యజీవం ఇచ్చే పలుకులు మీ నోటినుండి వెలువడుతూన్నాయి" అన్నాడు పేతురు (యోహా, 6:69), ఔను, ఈ గ్రంథం చదివేవాళ్ళు దానిలోని పలుకులు ఆలించేవాళ్ళు నిత్యజీవం పొందుతారు. ఈ పుస్తకాన్ని అనాదరం జేసేవాళ్ళ మృత్యుపు వాతబడతారు (బరూక్ 4:1).

ఇంతవరకు మనం బైబులు పఠనావశ్యకాన్ని గూర్చి విచారించి చూచాం. కాని బైబులును భక్తితో పఠించడం ఎలాగ? ఈ యంశం రెండవ భాగంలో వివరింపబడుతుంది.

2. భక్తియుతమైన బైబులు పఠనం

బైబులును చదివే మార్గాలు చాలావున్నాయి. శాస్త్రదృష్టితో, విజ్ఞానాన్ని ఆర్థించాలి అన్న కోరికతో బైబులు చదవవచ్చు. ఈలా కాకుండ ప్రార్థన చేసికోవాలి, జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనే కోరికతోను బైబులును చదువుకోవచ్చు. ఈ రెండవ విధానానికే “లెక్సియొ దివీన" అని పేరు. అనగా భక్తియుతమైన బైబులు పఠనం. ఇక యీ విధానాన్ని గూర్చి విచారిద్దాం.

బైబులు చదివి ప్రార్థన చేసికోవడం మన ఆశయం. మామూలుగా ప్రార్ధనం చేసికునేప్పడు మనం దేవునితో సంభాషిస్తూంటాం. ప్రార్థనా పూర్వకంగా బైబులు చదువుకునేప్పడు దేవుడు మనతో సంభాషిస్తూంటాడు. జీవితంలో యీ రెండు రకాల సంభాషణలూ అవసరమే.

కాని ప్రార్థనాపూర్వకంగా బైబులు పఠించడం ఎలాగ? బైబులు పఠనానికి చాలామంది భక్తులు చాలా మార్గాలు సూచించారు. వానిలో కొన్నింటిని సమన్వయపరచి “లెక్సియొ దివీన" విధానం క్రింద అమర్చి యిక్కడ పొందుపరుస్తున్నాం.

1. నియమిత కాలం :

ఆదర్శ క్రైస్తవుడు ప్రతిదినం కనీసం ఓ పావుగంట కాలమైనా బైబులు చదువుకోవాలి. ఈ పావుగంటకూడాను నెమ్మదిగాను ప్రశాంతంగాను వుండే కాలం ఎన్నుకోవాలి. భక్తుడు భగవంతునికి వాడిపోయిన పూవులు సమర్పింపడు. సాధారణంగా వేకువజాము లేక ఉదయం బైబులు పఠనానికి శ్రేష్టమైంది. ఉదయాన్నే బైబులు చదువుకొని