పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/218

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. హేబెలు విశ్వాసం గొప్పది. ఈ విశ్వాసం వల్లనే అతడు తన అన్న కయీను కంటె మేలైన కాన్కను దేవునికి అర్పించాడు. విశ్వాసం వల్లనే దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచి అతని అర్పణను స్వీకరించాడు. హేబెలు చాల కాలం క్రితమే మరణించినా తన విశ్వాసం ద్వారా నేటికీ మనతో మాట్లాడుతూనే వున్నాడు - హెబ్రే 11,4.

3. నోవా

నీతిమంతుడు దేవుని శిక్షను తప్పించుకొని రక్షణం పొందుతాడని నోవాకథ నిరూపిస్తుంది.

1. నీతిమంతుడైన నోవా

నోవా లేమెక్ కుమారుడు. అతని కాలంలో భూమి మీది నరులంతా దుష్టులైపోయారు. పాపకార్యాల్లో మునిగి దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. ఆ కాలంలో దైవభక్తి కలవాడు నోవా వొక్కడే - ఆది. 6,9. కనుక దేవుడు దుష్టలోకాన్ని నాశంజేసి నోవా కుటుంబాన్ని మాత్రం మిగల్చాలనుకొన్నాడు. అతని ద్వారా మళ్ళా నూత్న నరజాతిని వ్యాప్తిలోని తీసుకరావాలనుకొన్నాడు. నోవా అతని కుటుంబం బ్రతికి బయటపడ్డానికి అతన్ని ఓడను నిర్మించమన్నాడు.

నోవా దేవునిపట్ల విశ్వాసం గలవాడు. దేవుని ఆజ్ఞలను ఖండితంగా పాటించేవాడు. కనుక అతడు దేవుడు చెప్పినట్లే చితిసారకపు కొయ్యతో ఓడ కట్టాడు. అతని కుటుంబమూ, ఒక్కో జంట చొప్పున సమస్త జంతువులూ వోడలోకి వచ్చాయి. ఈ ప్రాణులన్నీ జలప్రళయాన్ని తప్పించుకొని బ్రతికాయి.

150 రోజుల జలప్రళయం ముగిసాక నోవా కుటుంబమూ ఇతర ప్రాణులూ వోడలోనుండి బయటికి వచ్చాయి. నోవా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి బలి అర్పించాడు. దేవుడు ఆ బలిని అంగీకరించాడు - ఆది 8, 20-22. అతడు నోవాతో నిబంధనం చేసికొన్నాడు. మళ్ళా జలప్రళయంతో ప్రాణికోటిని నాశంచేయనని అతనికి వాగ్దానం చేసాడు. వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో వర్దగుడిని నిల్పాడు - 9,9-17.

ఆదామునుండి మొదటి నరజాతి విస్తరిల్లింది. ఆ ప్రభువు ఆదాము ఏవలతో మీరు చాలమంది బిడ్డలనుకని వృద్ధిలోకి రండి. భూమినంతటిని వశంజేసికొనండి అని