పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/216

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



2. హేబెలు

1. నీతిమంతుడైన హేబెలు

నీతిమంతుడు హింసలకు గురౌతాడనే సత్యాన్ని కయీను హేబెలుల కథ విశదంచేస్తుంది. బైబులు మొదటి నుండి చివరిదాకా ఈ సత్యాన్ని మళ్ళామళ్ళా పేర్కొంటూనే వుంటుంది. ఒకే కుటుంబంలో పట్టిన సోదరులు ఒకరినొకరు అంగీకరించకపోతే ఏలాంటి అనర్దాలు దాపరిస్తాయో ఈ కథ చక్కగా వివరిస్తుంది.

ఈ యన్నదమ్ములు ఆదిదంపతులైన ఆదాము ఏవల కుమారులు. కయీను సేద్యగాడు. అతడు తన పొలంలో పండిన ధాన్యాన్ని దేవునికి కానుకగా అర్పించాడు. హేబెలు గొర్రెల కాపరి. అతడు గొర్రెపిల్లలను దేవునికి కానుకగా అర్పించాడు. కాని దేవుడు హేబెలు కానుకను అంగీకరించి కయీను కానుకను త్రోసిపుచ్చాడు. ఎందుకు? ఆదికాండం చెప్పదు. కయీను హృదయం నిర్మలంగా లేదు -1 యోహా 3,12. అందుచే ప్రభువు అతని కానుకను నిరాకరించాడు. దానితో కయీనుకి కోపమొచ్చింది. మొగం చిన్నబోయింది. చిర్రుమర్రులాడాడు. తమ్ముడిమీద అసూయ పెంచుకొన్నాడు. అతన్ని ఏవిధంగానైనా నాశంచేయాలని నిశ్చయించుకొన్నాడు.

హేబెలు నీతిమంతుడు. అతని హృదయం నిర్మలంగా వుంది. కనుకనే దేవుడు అతని కానుకను అంగీకరించాడు. అతడంటే ప్రభువుకి యిష్టం.

హేబెలు అన్న దుష్టబుద్ధిని పసికట్టలేదు. ఓ దినం కయీను తమ్ముడూపొలంవెళ్ళి వద్దాము రారా అని హేబెలుని పిల్చాడు. ఏకీడూ శంకింపకుండా హేబెలు అన్నవెంట వెళ్లాడు. అక్కడ కయీను తమ్మునిమీదికి దూకి అతన్ని చంపివేసాడు. అది లోకంలో తొలిహత్య తొలిరక్తపాతం. ఆనాటినుండి ప్రపంచంలో అన్యాయపు హత్యలు కొనసాగుతూనే వున్నాయి. హేబెలు నెత్తురు (ప్రాణం) దేవుడికి మొరపెట్టింది. ప్రభూ! మా అన్న నన్ను అన్యాయంగా చంపివేసాడు. నీవు తీర్పు చెప్పు అని రోదించింది - 4,10. న్యాయవంతుడైన ప్రభువు తీర్పు చెప్పాడు. కయీను చేసిన దుర్మార్గపు పనిని ఖండించాడు. అతనికి నేల పంటలు పండదనీ అతడు దేశద్రిమ్మరి ఐపోతాడనీ శపించాడు.

2. హేబేలు క్రీస్తుకి చిహ్నం

నీతిమంతుడైన హేబెలు సూచించిన క్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. అతనిలాగే ఇతడు కూడ పవిత్రుడు, నీతిమంతుడు - అ,చ. 3,14. ఐనా అతని ప్రజలే అతన్ని అన్యాయంగా హత్యచేసారు. నీతిమంతుడైన హేబెలు హత్య మొదలుకొని