పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అబ్రాహాము తనకు ప్రీతిపాత్రుడైన ఈసాకుని బలియిూయడానికి గూడ వెనుదీయలేదు - అది 22,1-2. ఈ భక్తుని నుండి ప్రేరణం పొంది నేడు మనమూ విశ్వాస పుణ్యాన్ని అధికం చేసికోవాలి.

2.అబ్రాహాము విశ్వాసాన్నిబట్టి బైబులు అతన్ని'దేవుని దాసుడు" అని పిలుస్తుంది - ఆది 22,24. “దేవుని స్నేహితుడు” అని చెప్తుంది - యొష 41,8. ఆ మహాత్ముడు భక్తిమార్గంలో మనకు ఆదర్శం కావాలి.

3.ప్రభువు అబ్రాహాముతో ఒడంబడిక చేసికొన్నాడు. ఆ వొప్పందం ప్రకారం అతని సంతానానికి కనాను మండలాన్ని ధారదత్తం చేసాడు - ఆది 15, 9–18. అప్పటినుండి యూదులు ప్రభువుని "అబ్రాహాము ఈసాకు యాకోబుల దేవుడు" అని పిలుస్తూ వచ్చారు - నిర్ణ 3,6. అబ్రాహాము కొల్చిన దేవుణ్ణి నేడు మనం కూడ శ్రద్ధతో కొలవాలి.

4.అబ్రాహాము అన్నిజాతుల వారికి తండ్రి, మధ్యవర్తి, మధ్యవర్తిగానే అతడు సౌదొమ గొమర్రా ప్రజల కొరకు దేవునికి విజ్ఞాపనం చేసాడు - ఆది 18, 22-32 అబ్రాహాము సంతానమైన యిస్రాయేలును దేవుడు దయతో జూస్తాడని యూదుల నమ్మకం. కనుక వాళ్ళ తమ ప్రార్థనలో దేవా! అబ్రాహాముని జూచి నీవు మమ్ము కరుణించు అని మనవిజేసికొనేవాళ్ళు – మీకా 7, 19. నూత్న వేదప్రజలమైన మనం కూడ ఈ యబ్రూహాముని భక్తిభావంతో స్మరించుకోవాలి. అతనినుండి ప్రేరణం పొందాలి.

5.బేతేలు దగ్గర వసించేపుడు అబ్రాహాముకీ అతని తమ్ముని కొడుకు లోతుకీ పొలం విషయమై తగాదా వచ్చింది. అప్పడు అబ్రాహాము లోతుతో నాయనా! మనం అయినవారలం. మనలో మనకు తగాదా లెందుకు? ఇక మనం వేరుపడదాం. మన చుటూ బోలెడంత నేలవంది. నీవు కుడివైపుకు వెళ్లే నేను ఎడమవైపుకి వెల్తాను. లేదా నీవు ఎడమవైపుకి వెళ్లే నేను కుడివైపుకి వెళాను. నీ యిష్టం వచ్చినవైపు నీవు వెళ్ళు అని చెప్పాడు. అప్పడు లోతు తూర్పువైపుకు జరిగాడు. అబ్రాహాము ఎడమవైపుకు జరిగాడు. దానితో తగాదా సమసిపోయింది. అబ్రాహాము అంత మంచివాడు. అతన్నిజూచి మనంకూడ ఇరుగుపొరుగువారితో ఒద్దికగా మెలగడం నేర్చుకోవాలి - ఆది 13,8-11.