పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని వేడుకొన్నాడు. కాని ఆ తండ్రి ఈ శారీరక పత్రుడ్డి ఆదరించలేదు — లూకా 16,24, క్రీస్తుకూడ యూదులను ఖండిసూ మీరు మేము అబ్రాహాము సంతానానిమని మురిసిపోతున్నారు. కాని మీరు నిజంగా సైతాను సంతానం. ఆ పిశాచంలాగే మీరూ నరహంతలు అని పల్మాడు - యోహా 8,40-44. ఈ వాక్యాలన్నీ కూడ అబ్రాహాముకి కేవలం శారీరక సంతానమైతే ఒరిగేదేమీ లేదని తెలియజేస్తాయి. యూదులకూ, నేడూ మనకూ కూడ కావలసింది అబ్రాహాము విశ్వాసం.

6. యూదుల పుణ్యక్రియలు వారిని రక్షించవు

యూదులకు మరో బ్రాంతికూడ వుండేది. అబ్రాహాము తన విశ్వాస విధేయతలను క్రియాపూర్వకంగా చూపించి నీతిమంతుడయ్యాడు కదా! కనుక యూదులు తమ పుణ్యక్రియల ద్వారానే తాముకూడ నీతిమంతుల మౌతామనుకొన్నారు. ధర్మశాస్తాన్ని పాటించడం ద్వారానే తాము పుణ్యాత్ముల మౌతామనుకొన్నారు. దేవుని అనుగ్రహం అవసరం లేదనుకొన్నారు. మేము ఆజ్ఞలు పాటిస్తున్నాం గనుక దేవుడే మాకు ఋణపడివున్నాడని మిడిసిపడ్డారు. పరిసయుడు సుంకరి సామెతలోని పరిసయని భావాలు ఈ కోవకు చెందినవే - లూకా 18,9-12. పౌలు యూదుల్లోని ఈ అహంకార భావాన్ని తీవ్రంగా ఖండించాడు. అతడు ఆదికాండ 15,6 ను ఉదాహరించి అబ్రాహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మకాన్ని ಬಲ್ಲಿ దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు. కనుక అబ్రాహాముని రక్షించింది అతని విశ్వాసంగాని పుణ్యక్రియలు కాదు. మనలను రక్షించేది" కూడ మనకు క్రీస్తుపట్లగల విశ్వాసంగాని మన పుణ్యక్రియలు కాదు" అని నొక్కిచెప్పాడు - గల 8,6. కనుక మన పుణ్యక్రియలు మనలను రక్షించవు. దేవుని వరప్రసాదం మనలను రక్షిస్తుంది. అసలు ఈ వరప్రసాద బలంవల్లనే మనం పుణ్యక్రియలు చేయగల్లుతున్నాం. మొదట దేవుని అనుగ్రహం, తర్వాత మన పుణ్యక్రియలు. అంతేగాని ముందే మన పుణ్యక్రియలు తర్వాత దేవుని వరప్రసాదం కాదు. యాకోబు జాబు 8,2024 కూడ ఈ విషయాన్నే ప్రస్తావిస్తుంది. మన విశ్వాసమూ మన పుణ్యక్రియలూ రెండూ కలసి మనలను రక్షిస్తాయని యాకోబు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు.

7. అబ్రాహాముకు నిజమైన సంతానం క్రీస్తే

అబ్రాహాముకు నిజమైన సంతానం ఎవరు? కేవలం శారీరక సంతానమైన యూదులు కాదు. ఆధ్యాత్మిక సంతానమైన క్రీస్తే, అతడు అబ్రాహాము వంశస్టుడు - మత్త 1.1 అబ్రాహాము సంతానమంతటిలోను అతని దీవెనలను సమృద్ధిగా పొందినవాడు క్రీస్తు వొక్కడే – గల 8,16. అసలు దేవుడు పూర్వం అబ్రాహాముని పిల్చింది ఎందుకు? 2O5