పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/210

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచారజీవి. ఐనా దేవుడు అతనికి ఓ గడ్డనిస్తాడు. అతడు అతని భార్య సార వృద్దులు. ఐనా వారికి సంతానం కలుగుతుంది. అతని జాతినుండే మెస్సీయా ఉద్భవిస్తాడు. ఈ మెస్సీయా ద్వారా అన్ని జాతులూ దీవెనలు పొందుతాయి. పై దైవ వాక్యాల్లో ఇంత శక్తి యిమిడి వుంది. అనామకుడైన అబ్రాహాముని గొప్పవాణ్ణి చేసింది ప్రభువు. కాల్టియా దేశంనుండి అతన్ని పిల్చుకొచ్చింది ప్రభువు వాక్కు ఐతే అబ్రాహాము తన తరపున తాను ప్రభువుని నమ్మి జీవించాడు. అతని రక్షణ ప్రణాళిక ప్రకారం నడచుకొన్నాడు. భావికాలంలో రాబోయే దైవ భక్తులందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. అదే అతని గొప్పతనం.

2. అబ్రాహాముకు పరీక్ష

దేవుడు అబ్రాహాము సంతతి అసంఖ్యాకంగా విస్తరిల్లుతుందని చెప్పాడు. ఐనా ఈ సంతానం రంగంలోనే ప్రభువు అతన్ని పరీక్షించాడు. ఈ పరీక్షలో అతని విశ్వాసం చలించలేదు కదా, పుటంవేసిన బంగారంలాగా తళతళా మెరిసింది. దేవుడు అతనితో నీ యేకైక కుమారుని, నీవు గాఢంగా ప్రేమించే యీసాకుని మోరీయా కొండమీద నాకు దహన బలిగా సమర్పించు అని చెప్పాడు - ఆది 22,2. ఈ యూసాకు ద్వారానే అబ్రాహాము సంతతి దోసపాదులా వృద్ధి చెందాలి. అది దేవుడు పూర్వమే చేసిన వాగ్గానం. కాని దేవుడు ఆ పిల్లవాణ్ణి బలి యిూయమని అడిగాడు. మరి దేవుని వాగ్దానం ఏలా నెరవేరుతుంది? పైగా యిూసాకు అబ్రాహాముకి ఏకైక కుమారుడు, కనుక అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ పిల్లవాడు పోతే ఆ ముసలి ప్రాయంలో అతనికి ఏమి మిగులుతుంది? తల్లిదండ్రులు సంతానాన్ని మిక్కుటంగా ఆశించే ప్రాత తరానికి చెందినవాడు అబ్రాహాము. ముసలివాడు ఊతకర్రమీద ఆధారపడి నడచినట్లుగా అబ్రాహాము తన ఆశలన్నీ ఈసాకుమీద పెట్టుకొని జీవిస్తున్నాడు. ముసలివాని చేతిలో నుండి ఊతకర్రను లాగివేస్తే అతడు పడిపోడా? దేవుడు ఆ భక్తునికి పెట్టిన పరీక్ష అలాంటిది.

అబ్రాహాము ఈ పరీక్షలో నెగ్గాడు. తన ప్రాణానికే ప్రాణమైన ఈసాకుని బలి యీయడానికి సిద్ధమై తన విశ్వాసాన్ని నిరూపించుకొన్నాడు. మనమైతే యావే వట్టి దొంగదేవుడు. బిడ్డణ్ణి యిచ్చినట్లే యిచ్చి మల్లా తీసికొని పోతున్నాడు. ఈ దేవుణ్ణి నమ్మి నేను మోసపోయాను అనుకొనేవాళ్లం. కాని అబ్రాహామో, ముసలి ప్రాయంలో నాకు అద్భుతంగా ఈసాకుని దయచేసిన దేవుడు అతడు పోతే అతని తాతలాంటివాణ్ణి మరొకట్టి యిూయలేడా అనుకొన్నాడు. అతనికి యిూసాకైనా మరెవరైనా దేవుని తర్వాతనే. అతని విశ్వాసం అంత గొప్పది. ఈ విశ్వాసంతోనే అతడు తన దైవభీతిని నిరూపించుకొన్నాడు - ఆది 22,12. దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడు. తాను దేవుని వరాల కొరకుగాక