పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


5.కాని అతడు మన తప్పలకొరకు గాయపడ్డాడు
మన పాపాలకొరకు నలిగిపోయాడు
అతడు అనుభవించిన శిక్షద్వారా
మనకు స్వస్థత కలిగింది
అతడు పొందిన దెబ్బలద్వారా
మనకు ఆరోగ్యం చేకూరింది

6.మన మంతా గొర్రెల్లా దారి తప్పాం
అందరం మన త్రోవన మనం వెళ్ళిపోయాం
కాని ప్రభువు మనందరి దోషం అతనిపై మోపాడు

7.దౌర్జన్యానికి గురైనా అతడు వినయంతో సహించాడు
పల్లెత్తు మాట అనలేదు
అతడు వధ్యస్థానానికి కొనిపోబడే గొర్రెపిల్లలా,
ఉన్ని కత్తిరింపబడే గొర్రెలా
మౌనంగా వున్నాడేకాని నోరు తెరవలేదు

8.అతన్ని దౌర్జన్యంగా, అన్యాయంగా కొనిపోయారు
అతనిగతి పట్టించకున్నవాళ్లే లేరు
అతన్ని నరికి సజీవుల లోకం నుండి తొలగించారు
మన ప్రజల పాపాలకొరకు అతన్ని వధించారు

9.ఏ తప్ప చేయకున్నా, ఎన్నడు అబద్దమాడకున్నా
అతన్ని దుష్టుల ప్రక్కన పాతిపెట్టారు,
దుర్మార్గుల ప్రక్కన సమాధి చేసారు

10.ప్రభువు ఈలా అంటున్నాడు
ఐనా అతన్ని బాధాభరితుణ్ణి చేయాలనే నా సంకల్పం
అతని మరణం పాపపరిహారబలి ఐంది
కనుక అతడు దీర్ఘాయువును బడసి
పత్రపౌత్రులను చూస్తాడు అతనిద్వారా
నా సంకల్పం నెరవేరుతుంది