పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నాల్గవ గీతం 52, 13-53, 12

52, 13. ప్రభువు ఈలా పలుకుతున్నాడు
"ఇదిగో నా సేవకుడు విజయాన్ని పొందుతాడు
అతడు ఘనుడై ప్రశసంలు అందుకొంటాడు
జనసమూహాలు అతన్ని చూచి విబ్రాంతి చెందుతాయి
అతడు వికృతరూపం తాల్చి వున్నందున
నరుళ్ళా కనిపించనే లేదు

14.కాని యిప్పడు బహుజాతులు
అతన్ని చూచి విస్మయ మొందుతారు
రాజులు అతన్ని చూచి నిశ్చేష్టులౌతారు
వాళ్ళు పూర్వం కనివిని యెరుగని సంగతులు తెలుసుకొంటారు.

53,1.ప్రజలు ఈలా బదులు చెప్పారు
మేమిపుడు విన్నవించే సంగతులను ఎవరు నమ్మారు?
ఇది ప్రభువువల్ల జరిగిందని ఎవరు గ్రహించారు?

2.దైవచిత్తం వలన అతడు
ఎండిన నేలలో వేరు పాతుకొని
లేత మొక్కలా పెరిగాడు
అతనికి సౌందర్యంగాని చక్కదనంగాని లేదు
మనలను ఆకర్షించే సాబగేది అతనిలో లేదు

3.ప్రజలు అతన్ని చిన్నచూపు చూచి తృణీకరించారు
అతడు విచారగ్రస్తుడు బాధమయుడు అయ్యాడు
నరులు అతనివైపు చూడ్డానికి కూడ ఇష్టపడలేదు
ప్రజలు అతన్ని తిరస్కరించడంచే
మనం అతన్ని లెక్కచేయలేదు

4.ఐనా అతడు మన బాధలను భరించాడు
మన దుఃఖాలను వహించాడు
ప్రభువు అతన్ని మోది, శిక్షించి, దుఃఖపెట్టాడని
మనం భావించాం