పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇష్టపడలేదు. కాని సేవకుడు మొదటనే యిష్టపడ్డాడు. మోషే నత్తివాడు. కాని ఇతడు వాక్చాతుర్యం కలవాడు. ఇతడు బోధ చేసేది ప్రవాసంలో అలసిపోయివున్న యిస్రాయేలీయులకు. 5. సేవకుడు ప్రభువు ఉపదేశాన్ని వినేవాడు. అతనికి దైవచిత్తం తెలుసు. అతడు ఎల్లవేళల ప్రభువుకి విధేయుడు. 6. రెండవది, సేవకుని బాధలు. అతని శత్రువులు తోడి యిప్రాయేలీయులే. వారు అతన్ని వీపుపై చరచారు. అతని గడ్డాన్ని పీకివేసారు. ఇది బాధనీ అవమానాన్నీ గూడ కలిగించే కార్యం. పూర్వం అమ్మోనీయులు దావీదు సేవకుల గద్దాలను కత్తిరించివేయగా అతడు వారిమీదికి యుద్దానికి పోయాడు - 2 సమూ 10,4. ముఖంమీద ఉమ్మివేయడంకూడ అవమానకరం – సంఖ్యా 12,14, యిర్మీయా మొదలైన ప్రవక్తలు కూడ ఈలాగే బాధలూ అవమానాలూ అనుభవించారు. 7. మోషే యిర్మీయా బాధలు అనుభవించినపుడు ప్రభువు వాళ్ళకు ఆ శ్రమలను అనుభవించే శక్తిని దయచేసాడు. విశేషంగా యిర్మీయాను ఇనుప స్తంభంలాగ ఇత్తడి తలుపలాగా గట్టిజేసాడు -యీర్మీ 1.18. ఇక్కడ సేవకుని ముఖాన్ని చెకుముకి రాయిలాగ గట్టిజేసాడు అనగా యావే అతనికి బలాన్నిచ్చాడని భావం. 8. భక్తునిమీద నేరాలు మోపేవాళ్ళ న్యాయస్థానానికి రావచ్చు. ఈ న్యాయస్థానం దేవుని సమక్షమే. దేవుడు తన భక్తుడు నిర్దోషి అని తప్పక నిరూపిస్తాడు. 9. యావే తన సేవకుని ఆదుకొంటాడు. భక్తుని శత్రువులు చిమటలు కొట్టిన బట్టలా నాశమైపోతారు. బైబుల్లో బట్టలు వాటిని తాల్చిన నరుట్టే సూచిస్తాయి. 10-11. ఇక్కడ భక్తుడు ఆపదల్లో దేవుణ్ణి నమ్మమని ప్రవాసంలోని శేషజనాన్ని హెచ్చరిస్తున్నాడు. వీళ్ళకూడ భక్తులే. కాని ప్రవాసంలోని అధిక సంఖ్యాకులైన యూదులు మాత్రం సేవకుణ్ణి బంధించి నాశం చేయడానికి పూనుకొన్నారు. వాళ్ళు తాము త్రవ్విన గోతిలో తామే పడతారు. ఈ గీతంలోని ముఖ్యాంశాలు ఇవి. భక్తుడు ప్రభువు వాక్కును ఆలించే శిష్యుడు, అతనికి విధేయుడు. శత్రువులు అతన్ని హింసించారు. ఐనా ప్రభువు హింసల్లో అతని కాపాడాడు. అతడు నిర్దోషి అని రుజువుచేసాడు. ఈ మూడవ ప్రవచనం కూడ క్రీస్తుపట్ల నెరవేరింది. సేవకుడు యావేమాట వినేవాడు. క్రీస్తుకూడ తండ్రి పలుకులను ఆలించి ఆపలుకులను మాత్రమే మనకు బోధించేవాడు - యోహా 12, 49-50. శత్రువులు సేవకునిలాగే క్రీస్తునికూడ పాటుల సమయంలో కొట్టి, ఉమ్మివేసి అవమానించారు-మత్త 27,30. 192