పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/199

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 నన్ను అవమానిస్తుండగా నేనేమి చేయలేదు 7. ప్రభువైన దేవుడు నన్నాదుకొంటాడు

వారి యవమానాలు నన్ను బాధించలేవు
నేను నా మొగాన్ని చెకుముకిరాతిలా గట్టిజేసికొన్నాను
నేను నగుబాట్ల తెచ్చుకోనని నాకు తెలుసు

8. నేను నిర్దోషినని సమర్ధించిచెప్పేవాడు

నా ప్రక్కనే వున్నాడు
నామీద ఎవడైన నేరం మోపదలిస్తే
అతడు నేను కలిసి న్యాయస్థానానికి వెళ్లాం 

నా ప్రత్యర్థి తన అభియోగాన్ని రుజువుచేయాలి 9. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడతాడు

ఇక నేను దోషినని నిరూపించే దెవడు?
నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టలా క్షీణిస్తారు

10. ప్రభువుపట్ల భయభక్తులు చూపుతూ

అతని సేవకుని మాట పాటించేవారలారా!

మీరు చీకటిలో నడవవలసి వచ్చినపుడు

ప్రభువుని నమ్మి అతనిపై ఆధారపడండి

11. కాని నిప్పను రగిల్చి కొరవులను మండించేవారలారా! మీరు నిప్పలోనికే నడుస్తారు

మీ కొరవల్లోనికే అడుగుపెడతారు
ప్రభువు వల్లనే మీ కీగతి పడుతుంది

మీరు ఫరోరబాధల్లో చిక్కుకొంటారు.” ఈ మూడవ గీతంలో సేవకుడు తన్నుగూర్చి రెండంశాలు చెప్పకొన్నాడు.

1. అతడు మంచి శిష్యుల్లాగ దినందినం ప్రభువు బోధలు ఆలిస్తాడు.
2. అతడు బాధలకూ అవమానాలకూ గురైనా జంకడు.

3. ప్రభువే అతని నిర్దోషత్వాన్ని వెల్లడిచేస్తాడు. 4. మొదటిది, ప్రభువు సేవకునికి బోధ చేస్తాడు. ఆ బోధనే సేవకుడు తిరిగి ప్రజలకు విన్పిస్తాడు. అతడు ప్రభువుకి శిష్యుడు. ప్రభువు వాక్కుని శ్రద్ధగావిని దాన్ని తన హృదయంలో పదిలపరచుకొనేవాడు. మోషే మొదట ప్రభువు దాసుడు కావడానికి 191