పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందిస్తాడు. మధ్యధరాసముద్ర తీరవాసులంతా అతని ఉపదేశాలు వింటారు. కనుక అతడు వీరిని మొదటి చరణంలోనే సంబోధించాడు. పూర్వం మోషే యూదులకు మాత్రమే బోధకుడు. కాని సేవకుడు యూదులకు అన్యజాతివారికీ కూడ బోధకుడు. ఈ రెండవ గీతంలో ముఖ్యమైన భావాలు ఇవి. సేవకుడు తల్లి కడుపులో పడినప్పటినుండే ప్రభువు అతన్ని ఎన్నుకొన్నాడు. ప్రభువు అతనికి శక్తిగల వాక్కుని దయచేసాడు. అది కత్తిలా, బాణంలా వాడియైంది. ఈ సేవకుడు యస్రాయేలు ప్రజే. అతడు ప్రభువు సేవలో కృషిచేసాడు. ఐనా ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఐనా ప్రభువు తననిజాయితీని చూచి తన్ను బహుకరిస్తాడని నమ్మాడు. ఇంతవరకు అతడు యిప్రాయేలుకే సేవలు చేసాడు. కాని ఇకమీదట ప్రభువు అతనిచే అన్యజాతులకు కూడ సేవలు చేయిస్తాడు.

ఈ రెండవగీతం కూడ క్రీస్తుపట్ల నెరవేరింది. సేవకుళ్ళాగే క్రీస్తుకూడ తల్లి గర్భం నుండే ప్రభువు సేవకు అంకితుడైనవాడు. సేవకుళ్ళాగే ప్రభువు కూడ యూదులు తన బోధలు ఆలించనందులకు నిరుత్సాహం చెందాడు. 'యెరూషలేమూ! కోడి తన పిల్లలను లాగే నేనూ నీ బిడ్డలను చేరదీయాలని కోరుకొన్నాను. కాని నీవు నా పలుకులు వినలేదు" అని బాధపడ్డాను - మత్త 23, 27.

{center|

మూడవ గీతం 50,4–11

}

4. ప్రభువువైన దేవుడు నాకు బోధచేసే శక్తిని అనుగ్రహించాడు

అలసిపోయినవారిని వోదార్చడానికి
అతడు నాకు సంభాషణాశక్తిని దయచేసాడు
ప్రభువు ప్రత్యుదయము నన్ను ప్రబోధించి
నేను శిష్యుళ్భాగ అతని బోధను ఆలించేలా చేస్తాడు
5. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానాన్ని దయచేసాడు

నేను అతనికి అడ్డు చెప్పలేదు

అతని మాట పెడచెవిని పెట్టలేదు
6. నన్ను మోదేవారికి నా వీపును అప్పగించాను

వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేస్తుండగా

నేను ఊరకున్నాను
నా మొగంమీద వుమ్మివేసి

190