పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ రెండవ గీతంలో సేవకుడే మాట్లాడుతున్నాడు. అతడు తన శ్రమ వ్యర్ధమైపోయిందని ప్రజలతో చెప్తున్నాడు. నిరుత్సాహపడుతున్నాడు. ఐనా తన్ను పిల్చిపని. వొప్ప జెప్పిన ప్రభువుని నమ్ముతున్నానని వాకొంటున్నాడు. 1. ఆనాటి యూదులకు తెలిసింది మధ్యధరా సముద్ర తీరప్రాంతాలు, సేవకుడు ఈ ప్రాంతపు ప్రజలందరినీ సంబోధించి వారితో మాట్లాడుతున్నాడు. తాను తల్లి కడుపులో పిండంగా వున్నపుడే ప్రభువు అతన్ని తన సేవకు ఎన్నుకొన్నాడు. యావే యిర్మీయాను కూడ ఈలాగే ముందుగానే ఎన్నుకొన్నాడు–యిర్మీ 1,5. కనుక సేవకుడు యావే తనకు ప్రత్యేకమైన పని ఒప్పజెప్పాడని నమ్మాడు. 2. ఆ కాలపు వీరుడైన పారశీకరాజు కోరెషు కత్తితోను బాణాలతోను దేశాలు జయించాడు. మన సేవకుడు మాత్రం తన శక్తిగల వాక్కుతోనే ప్రజలను జయిస్తాడు. ఆ వాక్కు కత్తి వంటిది, బాణంలాంటిది, అతడు ప్రవక్త ప్రభువు తరపున మాట్లాడేవాడు. అతని పలుకు కత్తిలా పదునైంది. ప్రవక్తలు తాము పలికే ప్రభువు పలుకు మహాబలంతో పని చేస్తుందని చెప్తుంటారు. ఇంకా సేవకుని పలుకు బాణంలాగా వాడియైంది. అతన్ని ప్రభువు కొంతకాలం పాటు దాచియుంచి అవసరమైనపుడు వాడుకొంటాడు. 3. సేవకుడు ప్రవక్త, అతని బోధలవల్ల యావేకు మహిమ కలుగుతుంది. తర్వాత ఈ సేవకుడు ఎవరనే ప్రశ్న వస్తుంది. ఈ వచనం అతన్ని యిప్రాయేలూ! అని సంబోధిస్తుంది. కావున యిక్కడ యిస్రాయేలు ప్రజే ఉమ్మడిగా యావే సేవకుడు అనుకోవాలి.

4. సేవకుడు కొంతకాలం బోధ చేసాడు. కాని అతని బోధలను ఏవరూ వినలేదు. కనుక అతనికి నిరుత్సాహం కలిగింది. కాని అతనికి తన్ను ఎన్నుకొనిన ప్రభువుమీద గాఢమైన విశ్వాసం ఉంది. కనుక తనకు విజయం లభించకపోయినా దేవుడు తన శ్రమను గుర్తించి తన్ను బహూకరించి తీరుతాడని నమ్మాడు. ప్రజలు కఠిన హృదయులై తన బోధలు వినకున్నా తాను మాత్రం శక్తివంచన లేకుండా శ్రమపడ్డానని ఎంచాడు. దేవుడు తన చిత్తశుద్ధిని మెచ్చుకొంటాడని నమ్మాడు.

5. ఇక్కడ సేవకుడు మొదటి చరణంలోని భావాలనే మళ్ళా తలంచుకొంటున్నాడు. ప్రభువు రూఢిగా తన్ను ఎన్నుకున్నాడని నమ్ముతున్నాడు. ప్రభువు తన శ్రమకు తగిన కీర్తినీ బహుమతినీ దయచేస్తాడని విశ్వసిస్తున్నాడు. 6. ప్రభువు సేవకుని అంకిత భావాన్ని మెచ్చుకొని అతనికి నూత్నకార్యాన్ని గూడ అప్పజెప్పాడు, ఇంతవరకు అతడు యిస్రాయేలీయులకు మాత్రమే బోధించేవాడు. ఇకమీదట అన్యజాతులకు కూడ బోధిస్తాడు. వారికి కూడ యావే ధర్మశాస్త్ర జ్యోతిని 189