పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/183

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ఈ కథలో దైవశాస్త్రానికి సంబంధించిన సత్యాలు చాల వున్నాయి. నరులకు మరణం తరువాత మళ్లా ఉత్దానముంది. దేవుడు లోకాన్ని శూన్యం నుండి సృజించాడు. ఆత్మకు చావలేదు. అది శాశ్వతంగా జీవిస్తుంది. దేవుడు దుర్మార్గులను శిక్షించితీరుతాడు. అతడు న్యాయం జరిగిస్తాడు.

2. ఎలియాసరుకథ - 2 మక్క 6, 18-31

పేనా యేడ్గురు సోదరుల్లాగే వేదహింసల కాలంలో ప్రాణత్యాగం చేసిన భక్తుడు ఎలియాసరు. ఆదర్శవంతమైన ఇతని మరణం పైయేడ్గురు యువకులకు ప్రేరణం పుట్టించింది. ఇది నేడు మనకు కూడ ఉత్సాహం కలిగిస్తుంది.

ఈ భక్తుడు రబ్బయి, అంటియోకస్ సేవకులు ఇతన్ని పందిమాంసం తినమని నిర్బంధం చేసారు. దాన్ని అతని నోటిలో కుక్కారు. కాని అతడు దాన్ని ధైర్యంగా ఉమిసి వేసాడు. తానే స్వయంగా హింసాస్థానానికి వెళ్లాడు. అక్కడ బలులర్పించేవాళ్లు ఎలియాసరుకి స్నేహితులే. వాళ్ళు కూడ యూదులే. కాని విశ్వాసాన్ని కోల్పోయి శత్రుపక్షంలో చేరారు.

ఈ భ్రష్టులు నీవు మామూలు మాంసాన్ని భుజించి పందిమాంసం తిన్నట్లుగా నటించు. అప్పడు చావును తప్పించుకోవచ్చు అని యొలియాసరుకి సలహా యిచ్చారు. మేము చేసే ఈ సహాయాన్ని అంగీకరించమని బతిమాలారు. కాని యెలియాసరు ఆ సలహాను పాటింపలేదు. రెండు కారణాలవల్ల అతడు దాన్ని నిరాకరించాడు. మొదటిది, దురాదర్శం. 90 ఏండ్ల యిూడున యెలియాసరు పందిమాంసం తిని ధర్మశాస్త్రన్ని మీరాడని యువకులు తలుస్తారు. అతన్ని చూచి యువకులు పెడమార్గం పడతారు. అది ఆ రబ్బయికి మాయనిమచ్చ 24-25.

రెండవది, అతడు తాత్కాలికంగా చావును తప్పించుకొన్నా తర్వాత ప్రభువు తీర్పుని తప్పించుకోలేడు - 26. నరులను మెప్పించి దేవుని శిక్షకు గురైతే ఏమి లాభం? ఇక, అతడు ధర్మశాస్త్రం కొరకు మరణిస్తే యువకులకు మంచి ఆదర్శం చూపించినవాడు ఔతాడు. కనుక అతడు మరణాన్నే ఎన్నుకొన్నాడు.

రాజాజ్ఞను ధిక్కరించిన యెలియాసరుని భటులు కొరడాలతో కొట్టారు. అతడు చనిపోతూ "నేనీ శ్రమలను తప్పించుకొని వండగలిగేవాణ్ణి. కాని ప్రభువు పట్లగల భయభక్తులచే వీటిని అంగీకరిస్తున్నాను. ఈ సంగతి దేవునికి తెలుసు” అంటూ ప్రాణాలు విడిచాడు. అతని మరణం యూదజాతిలోని పిన్నలకూ, పెద్దలకూ గూడ చక్కని ఆదర్శమైంది.