పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/182

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈమె కడగొట్టు కొడుకుకి రెండు సత్యాలు విశదీకరించింది. 1. దేవుడు శూన్యం నుండి ప్రపంచాన్ని సృజించాడు-28.ఈ భావం ప్రాచీన మతాల్లో వేటిల్లో కూడ లేదు. బైబుల్లో కూడ ఇక్కడే మొదటిసారి తగులుతుంది. హెబ్రేయుల జాబు 11, 3 ఈ భావాన్ని మరల జ్ఞప్తికి తెస్తుంది. 2. మరణం తర్వాత మళ్ళీ ఉత్థానముంటుంది. ఈ భావం దానియేలు గ్రంథం 12, 2 లోను, ఈ గ్రంథంలో ఈ కథలోను మొట్ట మొదటిసారిగా స్పష్టంగా కన్పిస్తుంది. దైవ ప్రేరణవల్ల పూర్వవేదాంతంలో భక్తులు ఈ భావాన్ని స్పష్టంగా ప్రకటించారు. సరే, శత్రువులు ఏడురు కొడుకుల తర్వాత తల్లిని గూడ చంపివేసారు. ఆ యెన్మిదిమంది యూదమతం కొరకు ధర్మశాస్త్రం కొరకు ప్రాణాలు అర్పించారు.

ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన సత్యాలు చాల వున్నాయి. 1. మన మతంపట్ల, మన విశ్వాసం పట్ల, దేవుని ఆజ్ఞలపట్ల మనకున్న నిష్ట ఏపాటిది? భారత ධීජoඒ* ධීයඩ්”ෙරපා ప్రారంభమయ్యాయి. గురువులను కొంతమందిని ఇదివరకే చంపివేసారు. మఠకన్యలను బాధించారు. విశ్వాసులను కష్టాలపాలు చేసారు. దేవాలయాలు ధ్వంసం చేసారు. మైనారిటీ ప్రజలంగా మన హక్కులను కాలరాస్తున్నారు. రానురాను ఈ హింసలు ఇంకా ఎక్కుమోతాయిగాని తగ్గవు. ఈ దేశంలోని తీవ్రవాదులు క్రైస్తవులను అణగదొక్కడానికి ప్రణాళికలు సిద్ధంచేసికొంటున్నారు. ఈలాంటి పరిస్థితుల్లో ఈ యేడురు సోదరుల కథ మనకు ప్రేరణం పుట్టిస్తుంది. ఇది ప్రధానంగా వేదహింసలకు, శ్రమలకు సంబంధించిన కథ. దీని నుండి మనం ప్రేరణం పొందాలి. ధైర్యంతో మనపాలబడిన శ్రమలకు సిద్ధం గాలి.

2. మన పాపం ఇతరులను గూడ బాధిస్తుంది. అలాగే ఇతరుల పాపం మనలను బాధిస్తుంది. నరుల పాపం సమాజం మీదకూడ దుష్పరిణామం చూపుతుంది. ఈ యంశాన్ని గుర్తించి మనం పాపానికి దూరంగా వుండాలి.

3. హింసలనూ కష్టాలనూ భరించడం కష్టం. ఐనా ఒక్కసత్యం మన శ్రమల్లో మనకు ఓదార్పునిస్తుంది. మన శ్రమలు మన పాపాలకూ, మన సంఘం పాపాలకూ గూడ పరిహారం చేసిపెడతాయి. ఈ భావంతోనే పై సోదరులు ఓదార్పుని పొందారు.

4. శ్రమల్లో మనం దేవునికి దగ్గరౌతాం. అతన్ని ఆశ్రయిస్తాం. అతనికి ప్రార్ధన చేసికొని అతనిపై ఆధారపడతాం. నేడు నరులు సుఖభోగాలకు అర్రులు చాస్తున్నారు. మనది సుఖసంస్కృతి. కాని ఈ సంస్కృతి మనలను దేవునికి దూరం చేస్తుంది. లోక వస్తువుల్లో కూరుకొని పోయేలా చేస్తుంది. అందుచే హింసలు ఒక విధంగా మనకు మేలే చేసిపెడతాయి. అవి మన భక్తిని పెంచుతాయి.