పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/180

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ కథ సిరియాలోని అంటియోకయ నగరంలో రాజు సమక్షంలో జరిగింది. ఏడ్గురు సోదరులు ప్రాణాలు విడువకముంను రాజును హెచ్చరించి మందలిస్తారు. ఈ కొడుకుల తల్లి తన బిడ్డల కంటెగూడ ఎక్కువ విశ్వాసము, ధైర్యము కలది. ఇక ఒక్కో కుమారుడు ప్రాణాలు అర్పించిన తీరును పరిశీలిద్దాం.

మొదటి కుమారుడు

రాజు సోదరులను పందిమాంసం తినమని నిర్బంధం చేసాడు. ధర్మశాస్త్రం దీన్నిఅంగీకరించదు. కనుక సోదరులు రాజాజ్ఞను ధిక్కరించారు. అతడు వారిని కొరడాలతో కొట్టించాడు. మొదటి కుమారుడు మేము చావడానికైనా ఒప్పకుంటాంగాని మా పూర్వుల చట్టాలను మీరం అన్నాడు. ఇది అతని ధర్మనిష్ట-2. భటులు అతని కాలు సేతులు నరికీవేసి గనగన మండే పెనముమీద కాల్చివేసారు. సోదరులు తల్లి అతని ప్రాణత్యాగాన్నికండ్లార చూస్తూ, ఒకరి నొకరు హెచ్చరించుకొంటూ ధైర్యంగా వుండిపోయారు.

రెండవ కొడుకు

రెండవ కొడుకునుకూడ భటులు పూర్వరీతినే శిక్షించారు. ఐనా అతడు ధైర్యాన్ని ఓర్పునీ కోల్పోలేదు. రాజుని ధిక్కరించి రాక్షసుడా! నీవు మమ్ము చంపితే నేమి? విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్దాన భాగ్యాన్ని దయచేస్తాడు అని పల్కాడు-9. పూర్వవేదంలోని యూదులకు పునరుత్దాన ముందని స్పష్టంగా తెలియదు. క్రీస్తుకి పూర్వం 200 యేండ్ల నుండే ఈ భావం స్పష్టంగా ప్రచారంలోకి వచ్చింది.

మూడవవాడు

సైనికులు మూడవవాణ్ణి హింసించారు. అతని అవయవాలను నరికివే. కాని అతడు ధైర్యంగా మీరు నా అవయవాలను నరికివేస్తున్నారు. మా ప్రభువు ఉత్దానకాలాన వీటిని నాకు మళ్ళా దయచేస్తాడు అని పల్మాడు-11. అతని ధైర్యానికి రాజు విస్తుపోయాడు.

నాల్గవవాడు

సైనికులు నాల్గవవాణ్ణి హింసించి శ్రమలకు గురిచేసారు. కాని అతడు దిట్టతనంతో మేము మా ప్రభువు కొరకు చనిపోతున్నాం. అతడు మాకు పునర్జీవాన్ని ప్రసాదిస్తాడు. మీకు మాత్రం ఉత్థానం, నూత్నజీవం లభించవు అన్నాడు–14. పునరుత్దానం మీది నమ్మిక అతన్ని ప్రేరేపించి ప్రాణాలు వదలుకొనేలా చేసింది.