పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/179

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



9. పూర్వవేద కథలు

బెబులు భాష్యం

- 151

విషయసూచిక

1. ఏడురు సోదరులు

171


2. ఎలియూసరు కథ

175


3. ఆకానుకు శిక్ష

176


4. దావీదు కథలు

177


5. షెబారాణ్ణి

18O


6. ఉజ్జీయా పతనం

181


7. మిర్యామునకు శిక్ష

182


8. మెరీబావద్ద నీళ్ళ

183

1.ఏడుగురు సోదరులు, తల్లి - 2 మక్క7

క్రీస్తుపూర్వం 167 ప్రాంతంలో అంటియోకస్ ఆనే గ్రీకురాజు యూదులను హింసించాడు. యెరూషలేము దేవాలయాన్ని అమంగళం చేసాడు. యూదులు ధర్మశాస్తాన్ని విడనాడి గ్రీకు దేవతలను కొలవాలనీ, గ్రీకు ఆచారవ్యవహారాలను పాటించాలనీ నిర్బంధం చేసాడు. భక్తిలేని యూదులుకొందరు అతనికి లొంగిపోయారు. కాని భక్తికలవాళ్ళు అతన్ని ఎదిరించారు. వేదహింసలకూ, ప్రాణత్యాగానికి భయపడకుండా ధర్మశాస్తాన్ని నిష్టతో పాటించారు. ఆలాంటి భక్తవర్గానికి చెందినవాళ్ళు ఏడుగురు సోదరులు, వారి తల్లి - 2 మక్క7.

ఈ కథలో ముఖ్యాంశం, ప్రాణాలను కాపాడుకోవడం కంటె ధర్మశాస్తాన్ని పాటించడం ముఖ్యం అనేది. ఈ సంఘటనం వేదహింసలు కాలంలో ధైర్యంగా ప్రాణత్యాగం చేయాలని చెప్పంది. ఇది ఆధ్యాత్మికంగా, నైతికంగా ప్రేరణను పుట్టించే కథ. నేడు మనకు కూడా స్పందన కలిగిస్తుంది.

యూదులకు 7 పరిపూర్ణసంఖ్య కనుక ఏడురు సోదరులతో కూడిన ఈ కుటుంబ పరిపూర్ణమైందనీ, దైవభక్తి కలదనీ భావం. ఈ సంఘటనంలో వర్ణించిన అంశాలన్నీ చారిత్రకమై యుండనక్కరలేదు. ప్రజలకు ప్రేరణం పట్టించడం రచయిత ముఖ్యోద్దేశం.

ఏడురు సోదరులకు రాజభటులు ఈ క్రింది శిక్షలు విధించారు. వారి నాలుకలు కోసివేసారు. కాలు సేతులు నరికివేసారు. తలమీది చర్మం పెరికివేసారు. వారిని గనగన మండే పెనముమీద కాల్చివేసారు.