పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెరచేవాడివి. ఇప్పడు నీ పాపం పండింది. ఈ యిద్దరు ఏ చెట్టు క్రింద పాపం చేసారో చెప్ప అన్నాడు. అతడు సింధూరం క్రింద అన్నాడు. ఇద్దరి సాక్ష్యాలు ఏకీభవించలేదు. కనుక వాళ్ళు చెప్పింది పచ్చి అబద్దమని తేలింది. దేవుడు వారి కపటత్వాన్ని వెల్లడిచేసి సూసన్నను కాపాడాడు.

ప్రజలు ఆ పెద్దలమీద మండిపడ్డారు. కూటసాక్షులు నిందితునికి పడే శిక్షను తామే అనుభవించాలి - ద్వితీ 9,19. ఈ నియమం ప్రకారం జనం న్యాయాధిపతులను రాళ్లతో కొట్టి చంపి సూసన్నను విడిపించారు. ఆమె బంధువులు దేవుణ్ణి సుతించారు. జ్ఞానియైన దానియేలు కీర్తి అంతట వ్యాపించింది.

ఈ కథ నుండి మనం నేర్చుకోవలసింది ఏమిటి?

1. ఈ సంఘటనంలో ప్రధాన పాత్ర సూసన్న భక్తులు ఆపదలో చిక్కి మొర పెట్టినపుడు దేవుడు వారి మొర ఆలించితీరతాడు. జీవితంలో కష్టాలు వచ్చినంత మాత్రాన్నే నాశమైపోము. భక్తులను కాపాడే దేవుడొకడు వున్నాడని నమ్మాలి.

2. కుట్రలు మోసాలు బయటపడకపోవు, అధర్మం గెలువదు. నరులకు పాపభీతి వండాలి. పాపం చేయడం కంటె చనిపోవడం మేలు.

3. కామం ఎప్పడు మన హృదయంలో ప్రవేశిస్తుందో మనకే తెలియదు. కాని కామవాంఛలకు లొంగిపోయేవాళ్ళ నాశమైపోతారు.

4. ఇతరులు చెప్పింది వెంటనే నమ్మకూడదు. నిజానిజాలు పరిశీలించి చూచిన పిదపకాని ఒక నిర్ణయానికి రాకూడదు. ఈలా సూసన్న కథ అనేక విధాల మనకు నీతిని బోధిస్తుంది. మన బాలికలు ఈ పుణ్యస్త్రీ పేరు పెట్టుకోవాలి.