పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/176

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పమన్నాడు. ముసలివాళ్ళు ఇద్దరు వేరువేరు చెట్ల పేర్కొన్నారు. వారి సాక్ష్యాలు ఏకీభవించలేదు. కనుక కూటసాక్ష్యాలు చెప్పారని తేలిపోయింది. దానియేలు సూసన్నను విడిపించి వృద్దులిద్దరికీ మరణదండను విధించాడు. ఈ తీర్పువలన దానియేలు కీర్తిబాగా పెరిగిపోయింది.

1. సూసన్న

యూదులు బాబిలోనియా ప్రవాసంలో వున్నపుడు యోవాకీము అనే సంపన్నుడు సూసన్నను పెండ్లిచేసికొన్నాడు. ఆమె అందగత్తె, భక్తురాలు. తల్లిదండ్రులు చిన్నపుడే ఆమెకు యూదజాతి నియమాలు జాగ్రత్తగా నేర్పారు. యూదులు యోవాకీము తోటలో ప్రోగై కొన్ని వ్యవహారాలు చర్చించుకొనేవాళ్లు. ఆయేడు ఇద్దరు వృద్దులైన పెద్దలను న్యాయాధిపతులనుగా నియమించారు. వీళ్ళ యోవాకీము ఇంటిలోనే ప్రజల తగాదాలకు తీర్పు చెప్పేవాళ్ళు. కాని వాళ్ళ బుద్ధి మంచిదికాదు. యిర్మీయా తన ప్రవచనంలో పేర్కొన్న ఇద్దరు దుష్టప్రవక్తల వంటివాళ్లు - 29, 21-23.

సూసన్న మధ్యాహ్నం తోటలో కాసేపు తిరుగాడేది. న్యాయాధిపతులు ఆమెమీద కన్నువేసారు. రోజూ తోటలో ఆమెను చూడ్డానికి కాచుకొని వుండేవాళ్ళు ఒకరోజు వాళ్లిద్దరూ ఒకరి కోరిక లొకరు తెలిసికొన్నారు. సూసన్న ఒంటరిగా దొరకినప్పడు చెరచాలని కాచుకొనివున్నారు.

2. న్యాయాధిపతుల కుతంత్రం

ఓ దినం మధ్యాహ్నం వాళ్ళ సూసన్నను చెరచాలని నిర్ణయించుకొని తోటలో దాగుకొని వున్నారు. ఆమె వాడుక ప్రకారం తోటకు వచ్చింది. ఆరోజు బాగ వేడిగావున్నందున తోటలో స్నానం చేయగోరింది. పనికత్తెలను చమురు తీసికొని రండని ఇంటికి పంపింది. పనిపిల్లలు తోట ద్వారములు మూసివేసి వెళ్ళగానే అక్కడ దాగివున్న వృద్దులు సూసన్నదగ్గరికి వచ్చి మాకు నీమీద కోరిక్త పుట్టింది. నీవు మా కోరిక తీర్చు లేకపోతే నీవిక్కడ ఎవడో యువకునితో వ్యభిచరించావని నీమీద నేరం మోపుతాం అన్నారు. సూసన్ననేను ప్రభువుకి ద్రోహంగా పాపంజేయడం కంటె నిర్దోషినిగా మీ చేతికి చిక్కడం మేలు అంది. ఈ వాక్యాలను బట్టి ఆమె ఎంత యోగ్యురాలో ఊహించవచ్చు. వెంటనే సూసన్నకేకలు వేయగా ఇంటిలోని పనివాళ్ళు పరుగెత్తుకొని వచ్చారు. ముసలి వాళ్ళు తమ కథను విన్పించారు. పనివాళ్ళు ఆ కథను నమ్మి సిగ్గుపడ్డారు.