పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధం = సూసన్నకథ

సూసన్న కథ దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో వస్తుంది. ఈ భాగం హీబ్రూ బైబుల్లో లేదు. దాని అనువాదమైన గ్రీకు బైబుల్లో మాత్రమే కన్పిస్తుంది. కనుక ప్రోటస్టెంటులు దీన్ని అంగీకరించరు. మనకు మాత్రం దైవప్రేరితమైంది. ఈ కథను క్రీ.పూ. 1వ శతాబ్దంలో వ్రాసివుంటారు.

ఇది మొదట ఓ జానపద కథగా ప్రచారంలో వుండేది. ఎవడో యూద రచయిత ఈ కథను ఎన్నుకొని యూద మతాంశాలను దీనిలోనికి ప్రవేశపెట్టాడు. కనుక మొదట లౌకిక పరమైన కథ తర్వాత మతపరమైన కథగా మారిపోయింది.

ఇది బైబుల్లోని ఉత్తమ కథల్లో వొకటి. ఒక్కసారి చదవగానే మన హృదయాన్ని ఆకట్టుకొంటుంది. అందుకే ఇది జనసామాన్యంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. కథ చిన్నదైన మంచి కథకు ఉండవలసిన లక్షణాలన్నీ దీనికీ వున్నాయి. సూసన్నకు ఏమి జరుగుతుందో అనే ఆందోళనం పాఠకునికి చివరిదాకా ఉత్కంఠను పుట్టిస్తుంది. కట్ట కడన దుష్టశిక్షణం, సాధురక్షణం అతని హృదయానికి ఊరట నిస్తుంది. కొందరి దృష్టిలో ఇది మొట్టమొదటి డిటెక్టివ్ కథ, కాని ఇది ప్రధానంగా మిడ్రాష్ కథ.

సూసన్నకథాసంగ్రహం ఇది. యూదులు బాబిలోనియా ప్రవాసంలో వున్నపుడు యోవాకీము భార్యయైన సూసన్న అనే స్త్రీ వుండేది. వారిది సంపన్న కుటుంబం. యూద సమాజానికి పెద్దలూ న్యాయాధిపతులూ ఐన వృద్దులు ఇద్దరు ఆమెను కామించారు. ఒక రోజు మధ్యాహ్నం వాళ్ళు సూసన్నను చెరుపగోరి ఆమె వాడుక ప్రకారం తిరిగే తోటలో దాగివున్నారు. సూసన్న తోటలోనికి వచ్చి పనికత్తెలను పంపివేసి వంటరిగా వుండగా వారిరువురు ఆమెను సమీపించి నీవు మాకోరిక తీర్చు. లేక పోతే నీ విక్కడ ఓ యువకునితో వ్యభిచారం చేసినట్లుగా నీమీద నేరం మోపుతాం అన్నారు. ఆమె పెద్దగా అరవగా ఇంటిలోని జనమంతా పరుగెత్తుకొని వచ్చారు.

మరుసటి రోజు సూసన్నకు తీర్పు చెప్పారు. వృదులు ఆమె వ్యభిచారం చేసిందని అబద్దాలు చెప్పారు. ప్రజలు వారి కథను నమ్మి ఆమెకు మరణశిక్ష విధించారు. వాళ్ళు ఆమె జవాబును విననుగూడ వినలేదు. ప్రజలు ఆమెను చంపడానికి తీసుకొనిపోతుండగా దేవుడు దానియేలు అనే యువకుని ప్రేరేపించాడు. అతడు వృద్దుల సాక్ష్యాన్ని తిరిగి ప్రశ్నింపగోరాడు. వారిద్దరినీ వేరుపరచి సూసన్న ఏ చెట్టుక్రింద వ్యభిచారం చేసిందో