పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/174

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆమె గొప్ప ప్రణాళిక పన్నింది. రూతు బోవసులను ఐక్యంజేయగోరింది. దేవుని కృప వలన ఆమె కృషి ఫలించింది. ఇప్పడు మనుమడ్డి ఎత్తుకొని సంతోషంతో అరుగుమీద కూర్చుంది. రూతుకి గొడ్రాలితనం పోయి, బిడ్డడు కలిగాడు. ఈ శిశువు ద్వారా మహాల్లోను కుటుంబం భూమిమీద కొనసాగుతుంది. వారి ఆస్తి అన్యాక్రాంతం కాదు.

రూతు బోవసులకు క్రమంగా ఓబేదు, యిూషాయి, దావీదు పుట్టారు. కనుక దావీదుకు రూతు ముత్తవ్వ ఔతుంది. తర్వాత మెస్సీయా ఈ దావీదు వంశం నుండే జన్మిస్తాడు. మత్తయి క్రీస్తు వంశావళిలో రూతును గూడ పేర్కొన్నాడు. ఆమె గొప్పతనం అది — మత్త 1, 5.

4. పుస్తకం సందేశం

ఈ కథలోని ముఖ్యాంశాలు ఇవి. 1 ఈ పుస్తకం కుటుంబ ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యమిస్తుంది. నవోమి దేవరన్యాయం ద్వారా కుటుంబానికి సంతానం కలిగిస్తుంది. సంతానం ద్వారా కుటుంబాన్ని నిలబెట్టాలని అత్తాకోడళ్లు పడిన శ్రమ మన మనసులను కరిగిస్తుంది. అత్తా కోడళ్ల అనురాగం మనలను ముగ్గులను చేస్తుంది. 2. దేవుడు దీనురాళ్లయిన వితంతువులను కరుణతో ఆదరిస్తాడు. 3. దేవుడు ఒక్క యూదులనే గాక రూతులాంటి అన్యజాతి ప్రజలనుగూడ ఆదరిస్తాడు. ఎజ్రా అన్యజాతితో చేసికొన్న మిశ్రమవివాహాలను రద్దుచేసాడు. కాని ఈ గ్రంథం మిశ్రమ వివాహాలను సమర్ధిస్తుంది. 4. ఈ పుస్తకం దావీదు వంశావాళిని గూడ పేర్కొంటుంది. దావీదుకి రూతు ముత్తవ్వ దావీదు వంశం నుండే మెస్సీయా రావాలి.

యావే నిబంధనంద్వారా యిప్రాయేలీయుల పట్ల కరుణ జూపినట్లే ఆ ప్రజలు కూడ ఒకరిపట్ల ఒకరు కరుణ జూపాలి. కనుకనే నవోమి, రూతు ఒకరిపట్ల ఒకరు కరుణజూపారు. బోవసుగూడ రూతుపట్ల కరుణ జూపి మహాల్లోను కుటుంబాన్ని నిలబెట్టాడు. ఈ కరుణ ఈ గ్రంథంలోని ఓ ముఖ్యాంశం.

ఈ పుస్తకం ప్రధానంగా స్త్రీల కథ. స్త్రీలకు విలువనిచ్చేది. దీన్ని చదివి మనం మహిళల పట్ల గౌరవం పెంచుకోవాలి. రూతు చరిత్ర పుణ్యకథ. కనుక భక్తులు ఈ గ్రంథాన్ని పలుసార్లు పారాయణం చేయాలి.