పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/173

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిద్ర పట్టాక మెల్లగా వచ్చి అతని పాదాలమీది బట్టను తొలగించి ఆ పాదాల దగ్గరే పండుకొంది. ఇక్కడ పాదాలమీద బట్టను తొలగించడం భార్యాభర్తల కలయికకు సూచనం.

బోవసు నడిజామున మేల్కొని తన పాదాల వద్దవున్న స్త్రీని చూచి విస్తుపోయాడు. రూతు సమయస్పూర్తితో అయ్యా! నీవు మాకు దగ్గరి చుట్టానివి. నన్ను పెండాడి నాకు సంతానాన్ని కలిగించు అని వేడుకొంది. ఈ ప్రణాళికను తయారుచేసింది అత్త దాన్ని నిర్వహించింది కోడలు. ఇక్కడ రూతు తెలివినీ, ధైర్యసాహసాలనూ మెచ్చుకోవాలి, ఆ అత్తాకోడళ్లు ఒకరికొకరు తీసిపోరు.

బోవసు అమ్మా! నీవు ఓ యువకుణ్ణి పెండ్డాడక వయోవృద్దుజ్జయిన నావద్దకే వచ్చావు. నీవు నీయత్త పట్ల కంటే నాపట్ల యోగ్యతరంగా ప్రవర్తించావు. నీ ధర్మబుద్ధిని మెచ్చుకోవాలి అన్నాడు. రూతు బోవసులకు కావలసింది శారీరికానందం కాదు. సంతానాన్ని కని మహాను కుటుంబాన్ని నిలబెట్టడం. ఈ ఘట్టాన్ని రచయిత చాల నేర్పుతోను కళాత్మకంగాను రచించాడు. బోవసు రూతు ద్వారా నవోమికి ఆరుకుంచాల ధాన్యం పంపాడు. ఈ చర్య నవోమి కుటుంబానికి సమృద్దీ, సంతానప్రాప్తి కలుగుతాయని సూచిస్తుంది.

4. రూతు బోవసుల పెండ్లి4, 1=12

బోవసు నగరద్వారం దగ్గరికి వచ్చాడు. ఇక్కడే పంచాయితీలన్నీ జరిగేవి. నవోమికి దగ్గరి బంధువు ఇంకొకడున్నాడు. రూతుకి సంతానాన్ని కలిగించవలసిన బాధ్యత అతనికి కూడ వుంది. అతన్నీ పదిమంది పెద్దలనూ నగరద్వారం దగ్గరికి పిలిపించారు. బోవసు ఆ బంధువుతో నవోమి తన పొలం అమ్మబోతుంది. నీవు ఆ పొలాన్ని కొని, రూతును పరిణయమాడి ఆమెకు సంతానాన్ని కలిగిస్తావా అని అడిగాడు. రూతుకి సంతానం కలిగితే ఆ పొలం ఆమె బిడ్డలకు దక్కుతుంది. కనుక అతడు నేనీకార్యం చేయలేను అన్నాడు. అప్పుడు బోవసు నేనే పొలాన్ని కొని రూతుని పెండ్డాడతానన్నాడు. అక్కడకు వచ్చిన పెద్దలంతా ఈ వదంతానికి సాక్షులుగా వున్నారు. వాళ్లు రూతు పుణ్యస్త్రీలైన లెయా రాహేళ్లవలె సంతానవతి కావాలన్నారు. బోవసు సుప్రసిద్దుడు కావాలని దీవించాడు.

5. దావీదు వంశవృక్షం 4, 13–22

బోవసు రూతుని పెండ్లాడగా ఆమెకు బిడ్డడు కలిగాడు. బేల్లెహేము స్త్రీలు నవోమిని అభినందించారు. ఈ కథ ఆమెతోనే ప్రారంభమై ఆమెతోనే ముగుస్తుంది. అబీమెలెకు