పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/172

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూతు అత్తతో నీతోపాటు నేనుకూడ బేల్లెహేము వస్తానంది. నీదేశం, నీ ప్రజలు, నీ దేవుడు, నా దేశం, నా ప్రజలు, నా దేవుడు ఔతారంది. రూతు పెనిమిటిపట్ల మమకారం జాపితే వింత యేమీ లేదు. కాని అత్తపట్ల, అదీ ఓ అన్యజాతి స్త్రీపట్ల మమకారం జూపితే అది వింతేకదా! యావే నిబంధనల ద్వారా యిప్రాయేలు ప్రజలపట్ల జూపిన కరుణే రూతు అత్తపట్ల గూడ చూపింది. రూతు శీలాన్ని మదింప వేయడానికి ఈ వొక్కసంఘటనం చాలు. 1, 16-17 వాక్యాలు బైబుల్లోని అతిప్రశస్త భాగాలకు చెందినవి. కనుక పాఠకులు వీటిని జాగ్రత్తగా మనం చేసికోవాలి.

బేల్లెహేములోని స్త్రీలు నవోమి కష్టాలకు సంతాపం తెలియజేసారు. ఆమెకూడ నాపేరు నవోమి కాదు. 'మారా? అని పల్కింది. నవోమి అంటే సుందరమైనదనీ, మారా అంటే విషాదకరమైనదనీ అర్థం.

2. రూతు బోవసును కలిసికోవడం 2, 1-23

బోవసు ఎలీమెలెకు కుటుంబానికి బంధువు. కనుక రూతుని పట్టించు కోవలసినవాడు అతడే. రూతు పరిగలేరుకోవడానికి పోయి బోవసు పొలంలోనే అడుగుపెట్టింది. దేవుడే ఆమెను అలా ప్రేరేపించాడు. రైతులు పైరు కోసేపుడు కొన్ని వెన్నులు పేదలకు వదలివేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది — లేవీ 19,9-10. బోవసు రూతుని తన పొలంలోకి ఆహ్వానించాడు. తాను కూలీలు అన్నం తినేపుడు రూతునికూడ భోజనానికి ఆహ్వానించాడు. ఆమె అతనికి వందనాలు అర్పించింది. బోవసు తన కుటుంబానికి బంధువని మాత్రం రూతుకి తెలియదు.

ఆరోజు రూతు కుంచెడు ధాన్యంతో ఇల్లు జేరి అత్తకు చూపించింది. నవోమికి ఆలోచనషుటింది. బోవను మనకు దగ్గరి చుట్టం గనుక మన సంగతిని పట్టించుకోవలసినవాడు అతడే అంది - 2, 20. అనగా బోవసు దేవర న్యాయం ప్రకారం రూతును పెండ్డాడాలని భావం.

ఒక స్త్రీ సంతానాన్ని కనకముందే ఆమె భర్త చనిపోతే అతని సోదరుడు లేక దగ్గరిచుట్టం ఆ వితంతువును పెండ్లాడాలి. వారికి కలిగే మొదటి బిడ్డడు చనిపోయిన నరునికి బిడ్డడౌతాడు. ఇదే దేవరన్యాయం. కుటుంబం గతించకుండా వుండడానికి ప్రాచీన యిస్రాయేలీయులు ఈ నియమం చేసికున్నారు — ద్వితీ 25, 5-6.

3. వివాహ సూత్రధారిణి నవోమి 8, 1=16

నవోమి రూతును చక్కగా అలంకరించుకొని బోవసు కళ్లందగ్గరికి వెళ్లమని చెప్పింది. బోవసు రాత్రి కళ్లంలోని ధాన్యందగ్గర పండుకొనివున్నాడు. రూతు అతనికి