పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 తెలియదు. వష్టిరాణి స్వతంత్రభావాలు కలది. ఆమె అభిమానాన్ని కాపాడుకోవడానికి రాణి పదవిని వదలుకొంది. ఆమెతో పోలిస్తే ఎస్తేరుకి సొంతభావాలు లేవు. ఈమె పెద్దలకు, మొర్టెకయికి విధేయురాలు. నేటి స్త్రీ విమోచనవాదులు ఈమెకంటె వష్టినే అధికంగా గౌరవిస్తారు.

     ఇద్దరు సేవకులు రాజుపై కుట్రపన్నగా మొర్టెకయి ఆ కుట్రను భగ్నం చేసి రాజుని కాపాడాడు. కాని మొర్టెకయికి అప్పటికప్పుడు ఏ బహుమానం లభించలేదు. ప్రధానమంత్రి హామానుకి మొర్టెకయి దండంపెట్టలేదు. యావే ప్రభువుకి తప్ప మరొకరికి దండం పెట్టకూడదని అతని తలంపు. కనుక హామాను అతనిపై పగబట్టాడు.

3. యూదులకు అపాయం 3, 7–5, 14

    మొర్టెకయి మీదగల కోపంచే హామాను యూదులందరినీ చంపించబూనాడు. రాజుకి లంచమిచ్చి యూదులను హత్యజేయడానికి శాసనం చేయించాడు. కాని ఆ ప్రజలు యూదులని రాజుకు తెలియదు. హామాను వాళ్ళు "ఒకానొక జాతి" అని చెప్పాడు. అదారు నెల (ఫిబ్రవరి – మార్చి) 13వ తేదీన యూదులను హత్యచేసి వారి యాస్తులను స్వాధీనం చేసికోవాలని అన్ని రాష్ట్రాల్లో ప్రకటించారు.
    మొర్టెకయి యూదుల వధను ఆపివేయవలసిందిగా రాజును బ్రతిమాలమని ఎస్తేరును కోరాడు. కాని ఆరోజుల్లో ఎవరైనా రాజు పిలువకుండానే అతని సన్నిధిలోకి వెత్తే చావు తప్పదు. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్లే ఆమెకు చావు, వెళ్ళకపోతే ఆమె ప్రజలకు చావు. ముందు ಗಿ'ಯಲ್ವ వెనుక నుయ్యి
    ఎస్తేరు తన ప్రజలకొరకు స్వీయప్రాణాలను గూడా సమర్పించడానికి పూనుకొంది. ఆమె దేవునికి ప్రార్ధన చేసింది. సింహం గుహలోనికి ప్రవేశింపనున్న తనకు వాక్ష్మక్తి ప్రసాదించమని వేడుకొంది - 14, 13. నిజాయితీతోగూడిన ఆమె మొరను దేవుడు ఆలించాడు.
    ఆమె రాజు సన్నిధిలోకి రాగా అతడు ఆమెవైపు కోపంగాజూచాడు. కాని దేవుడు రాజు హృదయాన్ని దిడీలున మార్చి అతనికి రాణిపై దయపుట్టేలా చేసాడు -15, 11. ఇక్కడ ఎస్తేరు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. రాజు రాణిని ఆదరంతో చేరదీసి నీ కోరిక యేమిటో చెప్పమాన్నడు. ఆమె అతన్ని విందుకి ఆహ్వానించింది. ఈ విందుకి హామాను కూడా వచ్చాడు. కాని అతడు అంతకుముందేమొర్దేకయిని ఉరితీయడానికి 75 అడుగు ఎత్తయిన ఉరికంబాన్ని సిద్ధం చేయించాడు. ఐతే బైబుల్లో విందులు పతనాన్నీ పదోన్నతనీ గూడా సూచిస్తాయి. హామాను పతనం దగ్గరించింది.