పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కంటే ఎక్కువ తెలివీ ధైర్యసాహసాలు ప్రదర్శించింది. ఆమె పూర్వవేదంలోని మిర్యాము, దెబోరా, యాయేలుల్లాగ ధీరవనిత. ఆమెనుండి మన క్రైస్తవ స్త్రీలు ప్రేరణం పొందాలి. ధైర్యంతో నాయకత్వం వహించి ముందుకు సాగాలి. మన బాలికలకు యూదితు, ఎస్తేరు, రూతు మొదలైన ధీరవనితల పేర్లు పెట్టాలి.
 7. మన దైవార్చనలో యూదితు మరియమాతకు పోలికగా వుంటుంది. ఆమె హోలోఫెర్నెసును లాగే మరియ పిశాచాన్ని జయించింది. యూదితు మరియకు సూచక వ్యక్తి.
 8. హోలోఫెర్నెసు వాలకం నేడు మనలో అరుదేమీ కాదు. పరస్త్రీని జంతుదృష్టితో జూచి కామించినపుడెల్ల ఆ దుషుడు మనలో మెదులుతున్నాడు అనుకోవాలి. కామ వికారాన్ని జయంచనివాడు భక్తుడు కాడు.

1. గ్రంథ స్వభావం

     బైబుల్లో హీబ్రూ ఎస్తేరు, గ్రీకు ఎస్తేరు అని రెండు గ్రంథాలున్నాయి. గ్రీకు పుస్తకంలో హీబ్రూ పుస్తకంలో వున్నదానికంటే 107 వచనాలు అధికంగా వున్నాయి. ప్రొటస్టెంటులు హీబ్రూ ఎస్తేరునీ, క్యాతలిక్కులు గ్రీసు ఎస్తేరునీ అంగీకరించారు. ఇది చారిత్రక గ్రంథంకాదు. చరిత్రను ఆధారంగా చేసికొని వ్రాసిన చిన్న నవల.
     ఈ పుస్తకంలో అధ్యాయాలనూ వచనాలనూ తెలిపే వుంటాయి. ఐనా కథాక్రమంమాత్రం సక్రమంగానే వుంటుంది. కనుక పాఠకులు ఈ పుస్తకంలోని అధ్యాయాల సంఖ్యల్లో పొరపాటుందేమోనని బ్రాంతి పడకూడదు. హీబ్రూ ఎస్తేరుని క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో వ్రాసారు. గ్రీకు ఎస్తేరులో అధికంగా వున్నభాగాలను తర్వాత చేర్చారు.

2. కథా సంగ్రహం

    పారశీక చక్రవర్తియైన అహష్వేరోషు వష్టిని రాణి పదవినుండి తొలగించి నూత్న రాణి కొరకు గాలించాడు. మొర్టెకయి అన్న కూతురు యూద మహిళ ఐన ఎస్తేరు నూత్నరాణి ఐంది.
    రాజు ముఖ్యమంత్రియైన హామానుకి మొర్టెకయిపై ద్వేషం. కనుక అతడు మొర్టెకయినీ, పారశీకంలోని యూదులందరినీకూడా వధించడానికి కుట్రపన్ని మోసంతో రాజుచే శాసనం చేయించాడు. ఎస్తేరు రాజు సన్నిధిలోకి వెళ్ళి యూదులను కాపాడమని