పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శౌర్యాన్ని మెచ్చుకొని చాలామంది ఆమెను పెండ్డాడ్డానికి వచ్చారు. కాని ఆమె తన భర్త మనషేపట్లగల గౌరవంచే జీవితాంతం వితంతువుగానే వుండిపోయింది. స్త్రీకి వివాహమాడ్డం, బిడ్డలను కనడం ఒక్కటే ముఖ్యం కాదని నిరూపించింది. తన ఆస్తిని బంధువులకు పంచియిచ్చింది. తన దాసికి స్వేచ్చనిచ్చింది. పండు ముసలితనంలో 105వ యేట పరమపదించింది.

4. పుస్తకం సందేశం

1.అంటెయోకస్ ఎఫిఫానీస్ వేద హింసలకు చిక్కిన యూదులకు ధైర్యాన్ని కలిగించడానికి రచయిత ఈ గ్రంథాన్ని వ్రాసాడు. కనుక ఇది ప్రధానంగా దేవుని పట్ల నమ్మకాన్ని పెంచేది. ఉజ్జీయా యూదితుతో "దేవుని పట్ల నీవు చూపిన నమ్మకాన్ని ప్రజలు ఏనాడూ విస్మరించరు" అంటాడు - 13, 19. ఈ గ్రంథం నేడు మనకు కూడా దేవుని పట్ల నమ్మకాన్ని పట్టిస్తుంది. ఐతే మనంకూడా యూదితులాగ నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలనూ, మనమీదికి వచ్చే దుష్టశక్తులనూ ధైర్యంతో ఎదిరించాలి.
2. నియంతల ఆగడాలు చెల్లవు. దేవుడు వారికంటె శక్తిమంతుడు. దైవశక్తితో ప్రజలు దుషులను ఎదిరించాలి.
3.దేవుడు కష్టాలను నరులను శిక్షించడానికే పంపడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి గూడ పంపవచ్చు. శ్రమల్లో మన విశ్వాసం బలపడుతుంది. యూదితు అస్పిరియనుల దాడిని ఈ దృష్టితో చూచింది.
4.దేవుడు బలహీనుల ద్వారానే బలవంతులను జయిస్తాడు. అతడు ఒక ఆడగూతురు ద్వారా మహా సైన్యాధిపతిని మన్నుగరపించాడు. మనకు దైవబలం.
5.ప్రార్ధనం మంచిదే. కాని ప్రార్ధనం వల్లనే అన్నీ నెరవేరవు. యూదితు కార్యాచరణకు పూనుకొని విరోధి శిబిరానికి వెళ్ళి అతన్ని ఓడించింది. దేవుడు నేను నీ ప్రణాళికను నెరవేరుస్తానని ముందుగా ఆమెకు హామీ ఈయలేదు. ఐనా ఆమె దేవుణ్ణి నమ్మి పనికి పూనుకొంది. నగర నాయకులు సాధించలేని కార్యాన్ని తాను సాధించింది. కనుక జపంతోపాటు కార్యాచరణం గూడ వుండాలి.
6. యూదితు స్త్రీజాతికే అలంకారం. ఆమె పేరుకే యూదమహిళ అని అర్థం. యూద మహిళల్లోని గొప్పతనం ఆమెలో రాసిపోసినట్లుగా కన్పించింది. యూద సమాజం స్త్రీలకు విలువనీయలేదు. ఐనా ఆమె ఆనాటియిస్రాయేలు పురుషుల