పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్పత్రాగి మైకంగమ్మి పడకమీద తూలి పడిపోయాడు. అలా యూదితు చేతికి సులువుగా దొరికిపోయాడు.

ఆమె దేవునికి ప్రార్ధన చేసింది. తాను చేయనెంచిన కార్యాన్నిసఫలం చేయమని వేడుకొంది - 13, 5. ఆమెకు శక్తినిచ్చేవాడు భగవంతుడే.

ఆ వీరనారి హోలోఫెర్నెసు కత్తితోనే అతని శిరస్సును తెగనరికింది. దాసి ఆ తలను ఆహారపదార్థాల సంచిలో దాచింది. ఇద్దరూ రోజూ వేకువజామున స్నానానికి పోయినట్టుగానే శిబిరంనుండి వెలుపలికి పోయారు. అచటినుండి బెతూలియా నగరద్వారం చేరుకొన్నారు.

పూర్వం యాయేలు శత్రువైన సీప్రాను కణతల్లో మేకు దిగగొట్టి చంపింది న్యాయాధి - 4, 17-22. దావీదు గొల్యాతును అతని కత్తితోనే చంపాడు -1 సమూ 17, 48-51. వీరిలాగే ఇక్కడ యూదితు శత్రువుని హతమార్చింది. దైవబలంతో బలహీనురాలు బలాఢ్యుణ్ణి గెల్చింది. అతడు మాయతో విందు ఏర్పాటు చేసి ఆమెను చెరచాలని చూచాడు. కాని ఆమె శత్రువుని మించిన మాయతో ఆ చెరుపును తప్పించుకొని విరోధి ప్రాణాలు తీసింది.

పురజనులు యూదితు చేతిలోని శిరస్పుని చూచి విస్తుపోయారు. దేవుడు లోకంలోని స్త్రీలందరికంటెను యూదితుని ఎక్కువగా దీవించాడని ఉజ్జీయా పొగడాడు. ఉజ్జీయా, ఇతర పురుషులు యుద్దానికి పోలేదు. భయంతో నగరంలోనే వుండి పోయారు. ఓ ఆడపడచు శిబిరానికి పోయి శత్రువుని ఓడించి వచ్చింది. అనగా ఓ స్త్రీ పురుషులను కాపాడింది. ఇది విడూరం.

5. శత్రువుల భంగపాటు 14, 11-16, 25.

యూదితు శత్రువు శిరస్సును నగర ప్రాకారంపై వ్రేలాడదీయించింది. పురజనులను విరోధి మీదికి దాడిచేయమని పంపింది. వాళ్ళు సేనాపతిని నిద్రలేపబోయి అతడు చచ్చాడని తెలిసికొని కలవరం చెందారు. ఆకాలంలో ఒక పురుషుడు ఒక స్త్రీ చేతిలో చావడం అవమానకరం. తమ నాయకుని మరణవార్తవిని అస్పిరియను సైనికులు శిబిరం నుండి పారిపోయారు. యూదులు వారిని తరిమి చంపివేసారు. వారి శిబిరాన్ని దోచుకొన్నారు. యెరూషలేము నుండి ప్రధాన యాజకుడు వచ్చి యూదితుని అభినందించాడు.

యూదితు పురజనులు యెరేషలేము వెళ్ళి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించారు. యూదితు హోలోఫెరెసు సామగ్రిని దేవునికి అర్పించింది. ఆ వీరనారి