పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/162

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమాచారాన్ని అందించడానికి వచ్చానని చెప్పింది. శిబిరంలో యూదితు చుట్టుమూగిన అస్సిరియా సైన్యం ఆమె సౌందర్యానికి మురిసిపోయి యిస్రాయేలు అందగత్తెలు లోకాన్నంతటినీ లొంగదీసికుంటారు అని పల్మారు - 10, 19. తర్వాత ఆమె నిజంగానే సేనాని లొంగదీసికొంది. ఇది వ్యంగ్యం.

సైనికులు ఆమెను హోలోఫెర్నెసు గుడారానికి తీసుకొనివెళ్ళారు. అతడు రాత్రి దివిటీల కాంతిలో యూదితు సౌందర్యాన్నిచూచి విభాంతి చెందాడు - 22. తర్వాత ఆమె అతని తల తెగనరుకుతుంది. కాని ఆ సుందరాంగిని చూడగానే ఇప్పడే అతని తల పోయింది.

యూదితు సేనాని ముందు పెద్ద ఉపన్యాసం చేసింది. అతన్ని బాగా పొగడి అస్పిరియా సైన్యమంతటిలో నీవు మొనగాడివంది. ఆ మాటలకు అతడు పొంగిపోయాడు. ఆమె అకియోరు ఉపన్యాసాన్ని జ్ఞప్తికి తెచ్చి "మా ప్రజల ఆహారం ఐపోయింది. వాళ్ళు తమ పంటలో దేవునికి అర్పించిన ధాన్యాన్ని భుజించి పాపం గట్టుకొంటారు. అప్పడు నీవు వాళ్ళను జయించవచ్చు. నేను నిన్ను యెరూషలేములో రాజుగా అభిషేకిస్తాను" అని చెప్పింది. సేనాపతి ఆమె మాటలన్నీ నమ్మాడు. ఇంకా ఆమె నేనొక ముఖ్యకారాన్ని నెరవేరుస్తాను. అది యేమిటో తెలిసికొన్నపుడు లోకమంతా విస్తుపోతుంది అని పల్మింది - 11, 16. హోలోఫెర్నెసు ఆ కార్యం బెతూలియాను జయించడం అనుకొన్నాడు, కాని యూదితు దృష్టిలో ఆ కార్యం అతని చామే.

రచయిత యూదితు విజయాన్ని యుద్ధవిజయంగా వర్ణించాడు. యూదితు శిబిరంలో మూడు రోజులు వసించింది. అక్కడ తాను వెంట తెచ్చుకొన్న శుద్దాహారాన్నే భుజించింది. యూదులకు ఆహార నియమం ముఖ్యం.ఆమె రోజూ వేకుక జాముననే లేచి శిబిరం ప్రక్కనున్న లోయలోనికి వెళ్ళి స్నానం జేసి శుద్ధిని పొంది వచ్చేది. దారిలో తన ప్రయత్నాన్ని దీవించమని దేవునికి మనవి చేసేది. ఈ యాచారం నెపంతోనే ఆమె నాల్గవరోజు అర్ధరాత్రి విరోధి శిరస్సుతో శిబిరం బయటికి రాగలిగింది.

కడన నాల్గవరోజు, అనగా 38వ రోజు రానేవచ్చింది. ఆ రోజు రాత్రి హోలోఫెర్నెసు యూదితుకి విందు చేసాడు. ఆ విందు ఆమెను చెరచడానికే - 12, 12. యూదితు తన సౌందర్యాన్ని ఆయుధంగా వాడుకొంది. చక్కగా అలంకరించుకొని మూర్తీభవించిన సౌందర్యంలాగ వచ్చి విందుశాలలో నాయకుని ముందు కూర్చుంది. అతడు ఆమెను కూడాలన్న కోరికతో మహోద్రేకానికి గురయ్యాడు. ఆమె అందానికి మురిసిపోయి తన జీవితంలో ఏనాడూ త్రాగనంతగా ద్రాక్షసారాయాన్ని త్రాగాడు. అలా