పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లొంగి ఈ సారాను స్వీకరించాను” అంటూడు = 8,7. భార్యాభర్తలు పరస్పరం సహాయం చేసికోవడం, సంతానాన్ని కనడం దైవాజ్ఞ, ఆదాము, ఏవ ఈ నవ దంపతులకు ఆరర్శం. వాళ్ళు ఉద్రేకానికి లొంగిపోలేదు. ప్రార్థన వారిని అదుపులో వుంచింది.

రగూవేలు 14 రోజులపాటు వివాహోత్సవం జరిపించాడు. ఈ మధ్యలో రఫాయేలు రాగీసుకు పోయి రూకల సంచిని తెచ్చాడు. గబాయేలుకూడా వివాహ మహోత్సవానికి వచ్చి వధూవరులను దీవించాడు. ఇంటి దగ్గర తోబీతు తన కుమారుడు అనుకొన్న కాలానికి రాలేదేమిటా అని బెంగపడ్డాడు. తండ్రి కంటెగూడ ఎక్కువగా తల్లి కుమారుని కొరకు ఎదురుచూచేది. రేయంతా అతని కొరకు కలవరించేది.

కడన తోబియా భార్యతో, మిత్రునితో నీనివే పట్టణానికి తిరిగివచ్చి తండ్రిని కలిసికొన్నాడు. కుమారుడు చేప పిత్తాన్ని తండ్రి కన్నులకు పూసి కంటిలోని పొరలను పెరికివేసాడు. తోబీతుకి చూపు వచ్చింది. అతడు కుమారునితో నాయనా! నా కంటికి దీపానివైన నిన్ను మళ్ళీ చూడగలిగాను అన్నాడు– 11, 14. అతడు కోడలిని ఇంటిలోనికి ఆహ్వానించాడు. రెండు కుటుంబాలు కలిసిపోయాయి.

4. రఫాయేలు దర్శనం 12, 1=14, 15.

దేవదూత సారాకు పట్టిన దయ్యాన్ని వదలించాడు. ముసలి తోబీతుకు దృష్టి వచ్చేలా చేసాడు. అతడు వచ్చిన పని ముగిసింది. ఇక దేవుని వద్దకు వెళ్ళిపోతాడు.

తండ్రికుమారులు రఫాయేలు ఉపకారానికి అతనికి తగిన జీతం చెల్లించాలనుకొంటున్నారు. దేవదూత వారికి చిన్న ఉపన్యాసం చేసాడు. దీన్ని పాఠకులు బైబులు నుండి చదవాలి – 12, 6-10. ఆ పిమ్మట అతడు నేను దేవుని సన్నిధిలో నిల్చి అతనికి సేవలుచేసే ఏడురు దేవదూతల్లో ఒకణ్ణని చెప్పాడు.

తండ్రీకొడుకులు అతన్ని చూచి భయపడ్డారు. దేవదూత వారికి చిన్న స్తుతించండని చెప్పి అదృశ్యుడయ్యాడు. సన్మనస్కులను గూర్చి చెప్పాలంటే బైబుల్లో ఈ గ్రంధానికి మించింది లేదు. వాళ్లు మనకు చేసే సేవలు నాలు. 1. వాళ్ళు మనకు మార్గదర్శకులై ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్తారు. 2. మనకు ఉపదేశం చేస్తారు. 3. మనచే ప్రార్థన చేయిస్తారు. 4. మనలను పరీక్షకు గురిచేసి దానిలో మనం నెగ్గేలా చేస్తారు. మన తరపున మనం వాళ్ళపట్ల భక్తిని పెంపొందించుకోవాలి.

తోబీతు కుమారునికి తుది సందేశం విన్పించి చనిపోయాడు. తోబియా నీనివేను వదలి ఎక్బటానాలో వసించాడు. నీనివే నాశమైంది. అతడు 117 ఏండ్లు జీవించి కన్నుమూసాడు.