పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/156

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడ్చింది. దేవా! నీవు నా ప్రాణమైనాతీయి, లేదా నాకు వేరే మార్గమైనా చూపించు అని ప్రార్ధించింది.

దేవుడు తోబీతు సారాల మొర విన్నాడు. ఆ యిద్దరు భక్తులను కాపాడ్డానికి రఫాయేలు దేవదూతను పంపాడు. అతడు తోబీతు గ్రుడ్డితనాన్ని తొలగించాలి. సారాకు పట్టిన అస్మోదియను దయ్యాన్ని పారదోలాలి. అతడు తోబియా ద్వారా ఈ కార్యాలు నెరవేరుస్తాడు. దేవుడు తోబీతు రగూవేలు కుటుంబాలను వివాహం ద్వారా కలిపివేస్తాడు. ఇది తోబీతు సారా భక్తుల ప్రార్ధనా ఫలితం.

2. ప్రయాణం 4, 1=6, 18

తోబీతు తాను చనిపోతాననుకొని కుమారునికి ఉపదేశం చేసాడు. దీనిలో తల్లిపట్ల గౌరవం, పేదలకు దానాలు చేయడం మొదలైన మంచి విషయాలు ఎన్నో వున్నాయి. పాఠకులు ఈ వుపన్యాసాన్ని జాగ్రత్తగా చదవాలి - 4, 3–21.

తోబియా చిన్నవాడు. అతడు తండ్రి సొమ్ము తీసికొని రావడానికి మాదియా దేశానికి వెళ్ళాలి. కనుక అసరియా అనే ప్రయాణికుడు అతనికి తోడి బాటసారిగా కుదిరాడు. ఇతడు రఫాయేలు సన్మనస్కే కాని తోబీతు కుటుంబానికి అతడు దేవదూత అని తెలియదు. 5, 22లో తోబీతు దేవదూత మన బిడ్డతో ప్రయాణం చేస్తాడు అంటాడు. తరువాత అతడు ఆశించినట్లే జరిగింది. ఇది వయ్యంగ్యం. తోబియాతోపాటు అతని చిన్నకుక్క కూడా ప్రయాణం చేసింది.

దారిలో తోబియా టిగ్రిస్ నదిలోకి దిగగా ఒకపెద్ద చేప అతన్ని బ్రింగబోయింది. రఫాయేలు సలహాపై అతడు చేపను చంపి దాని కాలేయం, గుండె, పిత్తం దాచుకొన్నాడు. ఇవి తరువాత అతనికి ఉపయోగపడతాయి.

త్రోవలో రఫాయేలు తోబియాకు సారాను గూర్చి చెప్పాడు. సృష్ణ్యాది నుండి దేవుడు ఆమెను నీకు భార్యగా నియమించాడు అని చెప్పాడు 6, 17. ఆ యువకునికి సారా మీద ప్రేమపుట్టింది.

3 సారా తోబీతులకు చికిత్స 7, 1–11, 18.

రఫాయేలు తోబియాను ఎక్భటానాలోని రగూవేలు ఇంటికి తీసికొనిపోయాడు. ఆ యువకుని కోరికపై రగూవేలు సారాను అతనికిచ్చి పెండ్లిచేసాడు. పడక గదిలో తోబియా చేప కాలేయాన్ని గుండెను కాల్చి పొగవేసాడు. ఆ పొగకు సారాకు పుట్టివున్న దయ్యం పారిపోయింది. సన్మనస్కుని శక్తికి పిశాచం లొంగిపోయింది. వధూవరులు కలసికోకముందు దేవునికి ప్రార్ధన చేసారు. తోబియా 'నేను కామతృప్తికిగాక దైవాజ్ఞకు