పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/150

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



దర్పంగల వన్యమృగాలు అచటికి సింహం అచటికి వెళ్ళలేదు నరులు కఠిన శిలలనుగూడ త్రవ్వుతారు కొండపాదులను కుళ్ళగించివేస్తారు పర్వతాల్లో సొరంగాలు త్రవ్వి విలువగల మణులను వెలికి తీస్తారు కాని విజ్ఞానం ఎచట కన్పిస్తుంది? వివేకం ఎందు చూపడుతుంది?



విజ్ఞానాన్ని చేరేమార్గం నరులకు తెలియదు అది నరలోకానికి దొరికేది కాదు
అగాధాన్నడిగితే విజ్ఞానం నావద్ద లేదంటుంది సముద్రాన్నడిగితే అదికూడ అలాంటిది నావద్ద లేదంటుంది దాన్ని బంగారంతో కొనలేం వెండిని తూచియిచ్చి సంపాదించలేం మేలిమి బంగారంకాని గోమేధిక నీలమణులుగాని దాని వెలతో సరితూగలేవు అది సువర్ణంకంటె, శ్రేష్టమైన కాచంకంటె మెరుగైంది సువర్ణపాత్రాన్ని దానికి మారకం వేయలేం పగడాలనూ స్పటికాలనూ దానితో వుపమింపలేం దానితో పోలిస్తే ముత్యాలెందుకు పనికిరావు ప్రశస్తమైన పుష్యరాగం దానికి సాటిరాదు పుటంవేసిన బంగారం దానికి సమంకాదు కాని విజ్ఞానం ఎచట కన్పిస్తుంది? వివేకం ఎందు చూపడుతుంది?


జీవించివున్న ప్రాణి యేదీ విజ్ఞానాన్ని చూడలేదు
ఆకాశాన యెగిరే పక్షులుకూడ దాన్ని కనుగొనలేవు
మృత్యువూ వినాశమూకూడ
మేము విజ్ఞానాన్ని గూర్చి విన్నాము అని మాత్రమే చెప్తాయి