పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/149

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



6. విజ్ఞానస్తవం

యోబు గ్రంథం 28వ అధ్యాయంలో విజ్ఞానస్తవం వస్తుంది. ఈ పుస్తకాన్నిగూర్చి మాట్లాడేపుడు ఈ యధ్యాయాన్ని పేర్కొనకుండా వుండలేం. కనుక ఈ విజ్ఞానగీతం తొనె ఈ చిన్ని పొత్తాన్ని ముగిద్దాం.


పూర్వవేదంలో విజ్ఞానం ఓ గొప్ప భావం. విజ్ఞానం అంటే యేమిటి? అది యీ జీవిత ధ్యేయాన్ని గూర్చి చెప్తుంది. ఈ జీవితంలో వచ్చే సుఖదుఃఖాల నేలా అర్థంచేసి కోవాలో చెప్తుంది. జీవితంలో విజయాన్ని ఏలా సాధించాలో చెప్తుంది. విజ్ఞానానికి వ్యతిరేకమైంది మూర్ఖత్వం. విజ్ఞానం పుణ్యం, మూర్ఖత్వం పాపం. దేవుడు విజ్ఞానిని లేక పుణ్యపురుషుణ్ణి బహూకరిస్తాడు. మూర్ణుణ్ణి లేక దుష్టుణ్ణి శిక్షిస్తాడు. సంగ్రహంగా చెప్పాలంటే దేవునిపట్ల భయభక్తులతో జీవించడమే విజ్ఞానం. కనుక పూర్వవేదప్రజలు ఈ విజ్ఞానాన్ని అలవర్చుకొని దేవుణ్ణి భక్తిభావంతో పూజించాలని కోరుకొన్నారు. నూత్నవేదంలో క్రీస్తు మన విజ్ఞాన మౌతాడు.


పూర్వవేదంలోని ఏడు విజ్ఞాన గ్రంథాల్లో యోబుగ్రంథంకూడ ఒకటి. కనుక పై విజ్ఞానభావాలు ఈ గ్రంథంలో కూడ కన్పిస్తాయి. విశేషంగా, సజ్జనులకు కష్టాలెందుకు అన్నది ఈ గ్రంథం es&f ముఖ్యప్రశ్న ఈ ప్రశ్ననుగూర్చి పూర్వమే చుచమ్ విజ్ఞానగీతాన్ని పరిశీలిద్దాం.


"వెండిని త్రవ్వడానికి గనులున్నాయి
సువర్ణాన్ని శుద్ధిచేయడానికి కొలిమి వుంది
జనులు భూమిని త్రవ్వి ఇనుముని తీస్తారు
రాళ్ళను కరగించి రాగిని తయారుచేస్తారు
నరులు అంధకారమయమైన భూగర్భంలోకి ప్రవేశించి
అచట చీకటిలో రాళ్ళు త్రవ్వి తీస్తారు
జనసంచారానికి దూరంగా
కాలూనడానికైన వీలులేని గోతుల్లోనికి దిగి
త్రాటికి వ్రేలాడుతూ గనులు త్రవ్వతారు
భూగర్భంలోని రాళ్ళలో మణులుంటాయి
అందలి మట్టి బంగారంతో నిండి వుంటుంది
డేగలకి ఆ గనుల్లోకి పోయే మార్గం తెలియదు
రాబందులకి అచటికి వెళ్ళే త్రోవ తెలియదు