పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మంచుకి తల్లి కలదా?
నేలపై పేరుకొనే నూగుమంచుకి జనని కలదా?
నభోమండలి నియమాలను నీ వెరుగుదువా?
ఆ సూత్రాలను భూమికి గూడ వర్తింపజేస్తావా?
నీవు మేఘాల నాజ్ఞాపింపగలవా?
వానిచే కుండపోతగా వానలు కురియింపగలవా?
మెరపుల నాజ్ఞాపింపగలవా?
అవి నీ కట్టడలను పాటిస్తాయా?
ఆకసంలోని మేఘాలను లెక్కించి
వానిచే వానలు కురిపించే దెవరు?
ఆ వానలు భూమిమీది ధూళిని గట్టి మద్దనుగాజేసి
మట్టి పెళ్ళలు గట్టిపడేటట్లు చేయడంలేదా?

అని ప్రశ్నించాడు - 38, 22-38. పైగా వన్యమృగాలనూ, పక్షులనూ పోషించే దెవరో చెప్పమని అడిగాడు

"గుహలలో దాగుకొని
పొదలలో పొంచివుండే సింహాలకు
నీవు ఎరను చేకూర్చిపెడతావా?
సింగపు కొదమలకు ఆహారం సంపాదించి పెడతావా?
ఆకలితో తిరుగాడే కాకులను పోషించే దెవరు?
ఆ కాకుల పిల్లలు ఆకలిగొని నాకు మొరపెట్టగా
వాటికి తిండి పెట్టేదెవరు?"

అని నిలదీసి అడిగాడు - 38, 39-41. యోబు ఈ ప్రశ్నలు విని నిర్ధాంత పోయాడు. అతనికి నోటమాట రాలేదు. ఈ సృష్టి దేవుని వనికినీ అతని ప్రాణిపోషణాచాతుర్యాన్నీ నిరూపిస్తుంది. కాని సృష్టివస్తువులనుగూర్చి యింతగా జాగ్రత్తపడే దేవుడు నరుడ్డిగూర్చి జాగ్రత్తపడడా? తనకు కష్టాలెందుకు వచ్చాయో యోబుకి తెలియకపోయినా దేవునికి తెలియదా? మరి యోబు దేవుణ్ణి తప్పపట్టడం న్యాయమా? ఇది యీ ప్రశ్నల భావం.

2. యోబు లొంగుబాటు

సజ్జనునికి బాధలెందుకు రావాలి అని యోబు ప్రశ్న కాని యిక్కడ ప్రభువు గుప్పించిన ప్రశ్నలవల్ల యోబు బాధల సమస్య మరుగున పడిపోయింది. అసలు ప్రభువు