పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేలను మోసే స్తంభాలు దేనిమీద నిలుస్తాయో, ఈ నేలకు పునాది వేసిందెవరో నీకేమైన తెలుసా? భూగర్భం నుండి సముద్ర ముద్భవించినపుడు దాన్ని కవాటాలతో బంధించి వుంచిందెవరు? సాగరంమీద మేఘాలను గప్పి దాన్ని పొగమంచుతో నింపింది నేను గాదా? కడలి కెల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండా వుండేలా చేసాను, నీ వీ మేరవరకు మాత్రమే పొంగిపారవచ్చు నీ బలమైన కెరటాలు ఇక్కడ ఆగిపోవలసిందే అని నేను కడలికి కట్టడ చేసాను"

అని అన్నాడు - 38, 4-11. ఇంకా, గాలులూ వానలూ మంచులూ మబ్బులూ కలిగించిందెవరో చెప్పమని దబాయించాడు

"నేను మంచు నేకొట్టులో దాచివుంచుతానో వడగండ్ల నే తావులో భద్రపరుస్తానో నీ వెన్నడైన చూచావా? కష్టదినాల్లో, యుద్ధకాలాల్లో వినియోగించడానికి నేను వాటి నట్టిపెట్టి యుంచుతాను సూర్యుడెచటినుండి బయలుదేరుతాడో తూర్పు వడగాలు లెచటినుండి పడతాయో నీ వెరుగుదువా? పెనుగాలులకు మార్గాలు కల్పించిం దెవరు? గాలివానలకు త్రోవలు సిద్ధంచేసిం వరు? జనసంచారంలేని మరుభూముల్లో వరాలు కురిపించే దెవరు? ఎండి బీటలువారిన నేలను నీటి చుక్కలతో తడిపి గ్రాసం ఎదిగించే దెవరు? వానకు తండ్రి కలడా?
పొగమంచుకి జనకుడు కలడా?