పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



3. దైవసాక్షాత్కారం

యోబు బాధలను భరించలేక తనకు దర్శనమిచ్చి తన తప్పేమిటో నిరూపించమని దేవుణ్ణి సవాలు చేసాడు. అతడు "నా పలుకు లాలించేవాళ్ళ ఎవరూ లేరా? ఇపుడు నా వాదాన్ని సాంతంగా వివరించాను ప్రభువు నాకు బదులు చెప్పనుగాక నా ప్రతిపక్షి నా నేరాలను వ్రాసి చూపిస్తే నేను ధైర్యంతో వాటిని నా భుజాలకు కట్టుకొంటాను తలపాగావలె నా శిరస్సుకు చుట్టుకొంటాను నేను చేసిన కార్యాలెల్ల నా ప్రతిపక్షి కెరిగిస్తాను అతని యెదుట ధైర్యంతో తలయెత్తుకొని రీవితో నిలుస్తాను" అని అన్నాడు — 31, 35-37. ఇక్కడ యోబు "ప్రతిపక్షి" దేవుడే. దేవుడు ఈ సవాలుని అంగీకరించాడు. అతడు తుఫానులో యోబుకి దర్శనమిచ్చాడు - 88, 1.

1. దేవుని సృష్టిమాహాత్మ్యం

ప్రభువు యోబుకి దర్శనమిచ్చాడు గాని అతని తప్పేమిటో చెప్పలేదు. తానతన్ని ఎందుకు దండిస్తున్నాడో తెలియజేయలేదు. దీనికి బదులుగా అతడు యోబుని రకరకాల ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఈ ప్రశ్నలు ఓవైపు దేవుని సృష్టిమాహాత్మ్యాన్ని సూచిస్తాయి. మరోవైపు నరుని అజ్ఞానాన్నీ అశక్తినీ తెలియజేస్తాయి. యోబు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక వెలవెలబోతాడు. ప్రభువు తన సృష్టిరహస్యాలను ఉగ్గడిస్తూ భూమినీ సముద్రాన్నీ చేసిందెవరని ప్రశ్నించాడు "ఓయి! ఇట్టి యవివేకపు మాటలతో నా జ్ఞానాన్ని తప్పపట్టడం నీకు తగునా? నీ విపుడు ధైర్యంతోనిల్చి నా ప్రశ్నలకు జవాబుచెప్ప నే నీ భూమికి పునాదులెత్తినపుడు నీ వున్నావా? నీ కంతటి విజ్ఞానమే వుంటే నాకు జవాబుచెప్ప ఈ భూమి వైశాల్యాన్ని నిర్ణయించిందెవరో, దాన్ని కొలిచిందెవరో నీ వెరుగుదువా?