పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/141

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 యోబు మిత్రులు ఈ లోకంలో దుషులకు కష్టాలూ సజ్జనులకు సుఖాలూ ప్రాప్తిస్తాయని వాదించారు.యోబు నిత్యజీవితంలో ఈలా జరగడంలేదని ప్రతివాదన చేసాడు. పైపెచ్చు ఈ లోకంలో దుర్మారులకు సుఖాలూ సజ్జనులకు కష్టాలూ వాటిల్లుతున్నాయని నిరూపించాడు. సజ్జనుడైన తనకు శ్రమలెందుకు వచ్చాయో అతనికే తెలియడం లేదు. దేవుడు దర్శనమీయడంలేదు. కనుక అంతా అంధకార బంధురంగా వుంది.

5. ఎలీహు సంభాషణం

                      శ్రమలు పాపంనుండి వారిస్తాయి
     ఈ పరిస్థితుల్లో నాల్గవ మిత్రుడైన యెలీహు ప్రవేశించాడు.ఇతడు తొలి ముగ్గురు మిత్రులతో కలసిరాడు. ఇక్కడ కథలోనికి అకస్మాత్తుగా ప్రవేశిస్తాడు.తొలి మువ్వరు మిత్రులూ దుర్మారులకు శిక్షగా కష్టాలు ప్రాప్తిస్తాయని పేర్కొన్నారు.ఎలీహు కష్టాలకు ఇంకో అర్థంగూడ వుందని చెప్పాడు. శ్రమలు మంచివాళ్ళకుగూడ రావచ్చు.మంచివాళ్ళకు వచ్చే శ్రమలు వాళ్ళకు బుద్ధిచెప్పడానికి వుపయోగపడతాయి. అనగా శ్రమలు సత్పురుషులను శిక్షించి వాళ్ళ పాపంలో పడకుండా వుండేలా చేస్తాయి. వాళ్ళను దేవునివైపు మరల్చుతాయి.యోబు శ్రమల భావంకూడ ఇదే ఐయండాలి అని యెలీహు భావం.

కనుక అతడు “నరులను పాపంనుండి వారించడానికి, వాళ్ళ పొగరు అణచడానికి దేవుడు వాళ్ళతో సంభాషిస్తాడు చావువాతబడి మృతలోకం చేరుకోవడమనే దుఃస్థితినుండి నరుని కాపాడాలనే అతని కోరిక దేవుడు నరుడ్డి వ్యధలపాలు గావించి అతని శరీరాన్ని బాధలతో నింపి అతనికి బుద్ధిచెప్తాడు నరుని కిట్టి వుపకారం దేవుడు మాటిమాటికి చేస్తాడు ప్రభువు నరుణ్ణి చావునుండి తప్పించి తన జీవనజ్యోతిని అతనిపై ప్రకాశింపజేస్తాడు" అని వాదించాడు - 33, 17-19, 29-30. కాని యోబు ఈ వాదాన్ని కూడ విన్పించుకోలేదు.