పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా వీణ శోకగీతాలకు సంసిద్ధమైంది నా పిల్లనగ్రోవి విలాపగీతాల కాయత్తమైంది"

అని దురపిల్లాడు - 30, 15-19, 26–27, 29-31.
     కడన యోబు మిత్రులముందు తాను నిర్లోషినని యొట్టపెట్టుకొన్నాడు. యిస్రాయేలు సంప్రదాయం ప్రకారం ముద్దాయి న్యాయస్థానంలో ఈలాంటి వొట్టు పెట్టుకొంటాడు. ప్రతిపక్షంవాళ్ళు ప్రతిఘటిస్తేనేతప్ప, న్యాయస్థానంలో ఈలాంటి వొట్టు పెట్టుకొన్నవాళ్ళని నిర్దోషులనుగా గణించి వాళ్ళ కనుకూలంగా తీర్పు చెప్తారు. ఈ వొట్టు "నేను పలానా తప్పలు చేస్తే నాకు పలానా శిక్షలు ప్రాప్తించుగాక" అనే రూపంలో వుంటుంది. యోబుకూడ ఈ పద్ధతిలోనే వొట్టపెట్టుకొంటూ

“నే నసత్యపు బాటలు త్రోక్మానా? మోసాని కొడిగట్టానా? ప్రభువు నన్ను నిరుష్టమైన తులతో తూస్తే నేను నిర్దోషినని తేలిపోతుంది నేను ధర్మమార్గంనుండి వైదొలగివుంటే, నా హృదయం చెడ్డను కోరుకొని వుంటే, నా చేతులు పాపకార్యాలకు పాల్పడివుంటే నేను వేసిన పైరులు నాశమగునుగాక నేను పండించిన పంటను ఇతరు లనుభవింతురుగాక నేను పొరుగువాని పెండాన్ని ఆశించి వాని గుమ్మంకడ పొంచివుంటే నా భార్య పరునికి కూడు వండి వాని పడకమీద పండుకొనునుగాక నే నితరుల పొలం ఆక్రమించుకోగా ఆ పొలం నన్ను తిట్టిపోసి తన నాగటి చాళ్ళను కన్నీటితో నింపుకొనివుంటే, ఆ పొలంలో పండిన పంటను నేననుభవించి దానిని పండించిన రైతుల కడుపు కొట్టివుంటే, ఆ పొలంలో నేడు గోదుమలకు మారుగా ముండ్లపొదలూ, యువ పైరుకుమారుగా కలుపుమొక్కలూ ఎదుగునుగాక” అని వాకొన్నాడు 31, 5-10. 38-40.