పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/139

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



యోబు మళ్లా తన నిర్ధొషత్వాన్నీ సమర్ధించుకొంటూ "నేను న్యాయాన్నే వస్త్రంగా తొడుగుకొన్నాను ధర్మాన్నే చొక్మాయిగాను తలపాగాగాను ధరించాను నేను గ్రుడ్డివారికి కన్నులయ్యాను కుంటివారికి కాళ్ళయ్యాను పేదసాదలకు తండ్రినయ్యాను అపరిచితుల మొర లాలించాను
దుపుల కోరలు ఊడబెరికి వాళ్ళచేతికి జిక్కినవారిని విడిపించాను నేను నా యింటనే సుఖశాంతులతో కన్నుమూస్తాననుకొన్నాను"

అని శోకించాడు - 29, 14-18.

అతడు తన పూర్వపు ఔన్నత్యాన్ని యిప్పటి దైన్యస్థితిలో పోల్చిచూచుకొంటూ "భయాలు నన్నావరించాయి నా ధైర్యం గాలివలె యెగిరిపోయింది నా భద్రత మేఘంవలె తేలిపోయింది నా ప్రాణం అవసానదశకు వచ్చింది నా బాధకు ఉపశమనం లేదు రేయి నా యెముకల్లో నొప్పిపడుతూంది నన్ను తొలిచివేసే వేదనకు అంతమే లేదు ప్రభువు నన్ను నేలమీద పడదోసాడు నేను ధూళితో సమానమయ్యాను నా కానందం చేకూరుతుందనుకొంటే శ్రమ లెదురయ్యాయి నేను వెలుగును చూస్తాననుకొంటే చీకట్లలముకొన్నాయి నేను బాధలతో క్రుంగిపోతున్నాను, నాకు పశాంతిలేదు ప్రతిదినం వేదనల ననుభవిస్తున్నాను నా రోదనం నక్కల రోదనంలా విచారసూచకమైంది ఏడారిలోని యుష్టపక్షి యేడ్పుల్లా నావి యేకాకి యేడ్పులయ్యాయి