పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/138

ఈ పుట ఆమోదించబడ్డది



“ఆ ప్రభువుని సమీపించే మార్గం,
అతన్ని చేరుకొనే విధానం
తెలిస్తే యెంత బాగుంటుంది !
అప్పడు నా అభియోగాన్ని అతనికి తెల్పుకొంటాను
నా వాదాలన్నిటినీ అతనికి విన్పించుకొంటాను
నేను తూర్పుకి వెత్తే ప్రభువచట కన్పించడం లేదు
పడమటికి వెత్తే అక్కడ దర్శనమీయడం లేదు
ఉత్తరాన వెదికితే అచట పొడచూపడం లేదు
దక్షిణాన వెదికితే అక్కడా దొరకడం లేదు"

అని విలపించాడు - 23, 3-4, 8-9. భగవంతుణ్ణి మనసార వెదకిగూడ దర్శించలేకపోవడం మహాబాధ, భక్తులకేగాని ఈ బాధ అర్థంకాదు.

యోబు తేపతేపకు తాను నిర్దోషినని వాకొంటూంటాడు. ఈ ధోరణిలోనే మరల
"ఐనా నా కార్యాలన్నీ ప్రభువుకి తెలుసు
అతడు నన్ను పరీక్షిస్తే నేను నిర్లోషినని తెల్లమౌతుంది
నేను ప్రభువు నిర్ణయించిన మార్గాన్నే నడచాను
కుడియెడమలకు బెత్తడైన జరగలేదు
అతని యాజ్ఞలన్నీ పాటించాను
అతని చిత్తాన్ని అనుసరించి జీవించాను"

అని ప్రమాణం చేసాడు - 23, 10-12. ఈలా యోబు తన నిర్లోషత్వాన్ని పదేపదే పునశ్చరణం చేయడం జూచి స్నేహితుడు బిల్టదు అతన్ని మందలిస్తూ

“దేవుని దృష్టిలో ఏ నరుడైనా
పుణ్యాత్ముడుగా గణింపబడతాడా?
నారికి జన్మించిన నరుడెవడైనా
విశుదుడుగా పరిగణింపబడతాడా?
ఆ ప్రభువుకి చంద్రుళ్ళి ప్రకాశం చూపట్టదు
చుక్కల్లో నిర్మలత్వం కన్పించదు
అలాంటప్పడు క్రిమీకీటకమఐన దుర్భల మానవుడు
దేవుని దృష్టిలో ఏపాటివాడు?"

అని ప్రశ్నించాడు - 25, 4-6. ఇవి చాలా లోతైన వాక్యాలు. ఈలాంటి వాక్యరత్నాలు ఈ గ్రంథమంతటా తళతళా మెరుస్తుంటాయి.