పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది



"అనంతమైన నీ దుష్టవర్తనానికి,
లెక్కల కందని నీ దుష్కార్యాలకు
దేవుడు నిన్ను దండిస్తున్నాడు
తోడివారు నీవద్ద అప్పతీసికొన్న సొమ్ముకి
నీవు వాళ్ళ ಬಣ್ಣಳ್ಳಿ కుదువసామ్మగా పుచ్చుకొని
వాళ్ళను దిగంబరులను గావించావు
నీవు ఆకలిగొన్నవాళ్ళకి పిడికెడు కూడు పెట్టలేదు
దప్పికగొన్నవాళ్ళకి గ్రుక్కెడు నీళ్ళీయలేదు
నీవు బలవంతుడివి కనుక పేదల పొలాలు కాజేసావు
వితంతువులను వట్టిచేతులతో పంపివేసావు
అనాథులకు అన్యాయం చేసావు"

అని అతన్ని నిందించాడు - 22, 5–9. ఇప్పడైనా పశ్చాత్తాపపడితే దేవుని దయవల్ల బ్రతికిపోతావని హెచ్చరించాడు. నీ పాపకార్యాలు వదలుకొమ్మని హితబోధ చేస్తూ

"నీవు వినయంతో దేవునివద్దకు తిరిగిరా
నీ యింటినుండి పాపకార్యాలెల్ల పారద్రోలు
నీ బంగారాన్ని ధూళిగా యెంచి బయట పారవేయి
నీ మేలిమి బంగారాన్నియేటియొడ్డున దొరికే
చిన్న రాళ్ళనుగా భావించి బయట విసరివేయి
అప్పడు దేవుడే నీకు బంగార మౌతాడు
ఆ ప్రభువే నీకు వెండికుప్ప ఔతాడు
అప్పడు దేవుడు నీకు ఆనందనిధి ఔతాడు
నీ వతన్ని విశ్వసిస్తావు"

అని చెప్పాడు - 22, 26–36.

ఐనా యోబు తాను పాపినని వొప్పుకోలేదు. అతని అపరాధమేమిటో అతనికి తెలియలేదు. దేవుడు తన్నీలా యెందుకు శిక్షిస్తున్నాడో అసలే తెలియలేదు. ఈలాంటి పరిస్థితుల్లో యోబు ఆ ప్రభువుని దర్శించాలనీ అతని వాక్కులు వినాలనీ యెంతో వబలాటపడ్డాడు. ఐనా ప్రభువు అతనికి దూరంగా వుంటాడేగాని అతని కంటికి కన్పించదు. ఆ భక్తునికి శారీరక వ్యధలకంటెగూడ దేవుణ్ణి దర్శించలేకపోయాననే మానసికవ్యధ అధిక ఫరోరమనిపించింది. కనుక