పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా పేరుప్రఖ్యాతుల్ని నాశంచేసాడు నలువైపులనుండి నన్నెదిరించి కూలద్రోసాడు నా యాశని మొక్కనులాగ పెరికివేసాడు అతని కోపం నామీద రగుల్కొంది అతడునన్ను తన శత్రువునిగా భావించాడు" అని నిటూర్పు విడిచాడు - 19, 6-11. కాని అతడు మహాభక్తుడు. కనుక మళ్ళా ప్రభువుని నమ్మాడు. ఆ ప్రభువు తన బాధలను తప్పక తొలగిస్తాడని విశ్వసించి "నా విమోచకుడు సజీవుడుగా వున్నాడనీ అతడు కడన నన్ను సమర్ధించితీరతాడనీ నాకు తెలుసు నా దేహం క్షీణించిపోయినా ఈ శరీరంతోనే నేను ప్రభువుని దర్శిస్తాను నా యీ నేత్రాలు స్వయంగానే అతన్ని చూస్తాయి అతడు నాకు పరాయివాడేమి కాదు" అని వాకొన్నాడు - 19, 25-27. అనగా తాను బ్రతికి వుండగానే దేవుడు తనకు దర్శనమిచ్చి తన కష్టాలను తొలగించి, తన్ను నిర్దోషినిగా ప్రకటిస్తాడని యోబు ఆశించాడు. దేవుడు తనకు అన్యాయం చేసాడనికానీ, అతడు పక్షపాతి అనికాని యోబు యొక్కడా చెప్పడు. అతడు తనకు దర్శనమీయడంలేదనీ, తన మొర విన్పించుకోవడం లేదనీ యోబు బాధ, భక్తుడు కష్టాల్లో మొరపెట్టుకొన్నా దేవుడు తన్ను పట్టించుకోకపోతే యేలా వుంటుంది? ఎంత ప్రార్ధనం చేసినా దేవుడు మనకు దూరంగా వున్నాడు అన్పిస్తుంటే సహించడం యేలా? యోబు వ్యధ యిదే. యోబుకి తన తరపున తాను దుషుడను కానని తెలుసు. దేవుని తరపున దేవుడు అన్యాయం చేసేవాడు కాదనికూడ తెలుసు. ఐనా ఆ ప్రభువు తన్నుపట్టించుకోవడం లేదు, తన వేడికోలును ఆలించడంలేదు. ఈ పరిస్థితిని యోబు భరించలేకపోయాడు.

4. మూడవ సంభాషణం

యోబు వేషధారియై యుండాలి యోబు నేను నిర్లోషినై గూడ శ్రమలనుభవిస్తున్నానని మాటిమాటికి చెప్పడం జూచి మిత్రులతన్నివేషధారినిగాను కపటభక్తునిగాను గణించారు. అతడు తాను రహస్యంగా చేసిన పాపాలకు శిక్షననుభవిస్తున్నాడని యెంచారు. ముఖ్యంగా యెలీఫాసు 128