పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“దుర్మార్గుడు స్వల్పకాలం మాత్రమే వృద్ధిజెందుతాడు

వాని సంబరం కొద్దికాలం మాత్రమే నిలుస్తుంది
దుషుడు ఆకాశం వరకు ఎదిగి 

మేఘమండలం తాకవచ్చుగాక చివరి కతడు ధూళివలె యెగిరిపోతాడు

పూర్వమతన్ని యెరిగి వున్నవాళ్ళు

ఇప్పడతడేమయ్యాడని ప్రశ్నిస్తారు

అతడు స్వప్నంలాగ మరుగైపోతాడు నిదురలో కన్పించిన దృశ్యంలా మాయమైపోతాడు"
అని చెప్పారు- 20, 5-8.

ఈ పట్టున యోబు తన బాధల్ని స్మరించుకొని "నేను దిగులుతో గోనె తాల్చాను

ఓడిపోయి యిూ మంటిమీద బోరగిల బడ్డాను 

ఏడ్చిఏడ్చి నా మొగం కందింది నా కన్నులు వాచి నల్లబడ్డాయి ఐనా నే నేపాపమూ చేయలేదు నా ప్రార్ధనలో చిత్తశుద్ధి లోపించలే" అని విలపించాడు 16, 15-17. తన దుఃఖాన్ని తనలోనే దిగమింగుకొంటూ నా సమాధే నాకు తండ్రి అనీ నన్ను తినివేసే పరుగులే

నాకు తల్లీ తోబుట్టువులు అనీ నేను వాకొంటాను 

ఇక నాకు ఆశ యొక్కడిది?

నాకు మంచిరోజు లున్నాయని యెవరైనా వూహిస్తారా? 

అని కుమిలిపోయాడు — 17, 14-16. దేవుడు తనపట్ల శత్రువులా ప్రవర్తిస్తున్నాడని వాపోతూ “నన్ను అణగదొక్కినవాడు దేవుడేనని తెలిసికొనండి నన్ను బంధించడానికి వలపన్నినవా డతడే

అతడు నా త్రోవకు అడ్డం కల్పించాడు 

నా మార్గాన్ని చీకటితో కప్పివేసాడు నా పరువుని మంటగలిపి 127