పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

తాను నిర్దోషినని యోబు వాదం సారాంశం. నిర్దోషియైన తానెందుకు బాధలనుభవించాలో అతనికే అర్థంకాలేదు. ఔను, బాధలు వచ్చినపుడు సహించడం ఎంత దుర్భరం! దేవునిమీద మొరపడకుండా వుండడం ఎంత కష్టం! ఇక్కడ శ్రమలకు తట్టుకోలేక భగవంతునిమీద సుమ్మర్లపడే యోబు మనకందరికీ ప్రతీకగా వుంటాడు. కష్టాలు వచ్చినపుడు భగవంతుని చిత్తానికి లొంగేవాళ్ళు మనలో ఎంతమంది?

3. రెండవ సంభాషణం

యోబు దుష్టుడై యుండాలి

మిత్రులు పశ్చాత్తాపపడమని పదేపదే చెప్పినా, యోబు పశ్చాత్తాపపడకుండా నేను నిర్దోషినని వాదిస్తున్నాడు. కనుక అతడు దుషుడూ, పాపీ ఐయండాలి అనుకొన్నారు మిత్రులు. అందుచేత వాళ్ళు నీవు పశ్చాత్తాపపడు. లేకపోతే దుషులందరిలాగే దేవుడు నిన్నుకూడ నాశం చేస్తాడు అని హెచ్చరించారు. ముఖ్యంగా యెలీఫాసు "అసలు ఏ నరుడు విశుదుడో చెప్ప? నారికి జన్మించి నరులలో పుణ్యశీలు డెవడు? ప్రభువు దేవదూతలనే నమ్మడు దూతగణాలే అతని కంటికి నిర్దోషంగా కన్పించవు అలాంటప్పుడు పాపాన్ని నీటినివలె ప్రిమింగివేసే చెబ్బరజాతికి చెందిన నీక్రుస్తా మానవుడా అతని దృష్టిలో నిర్మలుడు?" అని ప్రశ్నించాడు - 15,14-16. కాని యోబు దుర్మారులందరు నాశమైపోతున్నారా అని యెదురుప్రశ్న లేస్తూ 'దుర్జనుల దీపం ఆరిపోదేల? వాళ్ళకు వినాశం దాపురించదేల? దైవకోపం వాళ్ళను నాశం చేయదేల? గాలికి గడ్డిపోచలాగాను, సుడిగాలికి కళ్ళంలోని పొట్టులాగాను వాళ్ళు కొట్టుకొని పోరేల?"

అని అడిగాడు - 21, 17 -18. అందుకు మిత్రులు, దుర్మార్డులు మొదటలో గాకపోయినా తర్వాతనయినా నాశంగాక తప్పదని జవాబిస్తూ

126